News December 22, 2025
ప్రజల ఆరోగ్యంపై రాజీ వద్దు: కలెక్టర్

ఆహార కల్తీని అరికట్టి ప్రజలకు స్వచ్ఛమైన ఆహారం అందేలా చూడాలని బాపట్ల కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ భావనతో కలిసి ఆహార భద్రతా ప్రమాణాలపై (FSSAI) అవగాహన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఆహార పదార్థాల్లో కల్తీని గుర్తించే విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో DRO గంగాధర్ గౌడ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Similar News
News December 27, 2025
అప్పుడు లేచిన నోళ్లు.. ఇప్పుడు లేవట్లేదే?

క్రికెట్‌లో భారత్ అనగానే ఒంటికాలి మీద వచ్చేవాళ్లు చాలామందే ఉన్నారు. మన పిచ్‌ల వల్ల టెస్ట్ క్రికెట్ చచ్చిపోతోందని నోటికొచ్చిన మాటలన్నారు. అలాంటి వాళ్లు AUS పిచ్‌లపై నోరు మెదపకపోవడం ఆశ్చర్యం. ప్రస్తుత యాషెస్ సిరీస్‌లో NOV 21న పెర్త్‌లో తొలి టెస్ట్, ఇవాళ మెల్‌బోర్న్‌లో 4వ మ్యాచ్ కేవలం రెండ్రోజుల్లోనే ముగిశాయి. మన పిచ్‌లను క్రికెట్‌కు ప్రమాదంగా అభివర్ణించినవాళ్లు ఇప్పుడు మూగబోవడం వింతగా ఉంది.
News December 27, 2025
VKB: జిల్లా వ్యాప్తంగా కిటకిటలాడుతున్న గ్రంథాలయాలు

తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే టెట్ పరీక్షకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థుల్లో గుబులు పుడుతోంది. దీంతో అభ్యర్థులు వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రంథాలయాలకు పోటెత్తారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ టీచర్‌లకు టెట్ అర్హత తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో ఉపాధ్యాయులు టెట్ పరీక్ష రాయనున్నారు. జనవరి 3 నుంచి పరీక్షలు జరుగుతాయి.
News December 27, 2025
ప్రాజెక్టులపై అసెంబ్లీలో PPT ప్రజెంటేషన్!

TG: ఈనెల 29 నుంచి ఆరంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగనున్నాయి. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులపై అధికార, విపక్షాల మధ్య హోరాహోరీ చర్చ జరిగే అవకాశముంది. PPT ప్రజెంటేషన్ ద్వారా దీటుగా జవాబిచ్చేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సిద్ధమవుతున్నారు. అదే తరహాలో తానూ PPTతో ప్రశ్నించడానికి BRS నేత హరీశ్ రెడీ అవుతున్నారు. ఒకవేళ తనను అందుకు అనుమతించకపోతే సభ వెలుపల PPT ప్రదర్శించాలని యోచిస్తున్నారు.


