News April 10, 2025

ప్రజల భద్రతే పోలీసుల లక్ష్యం: ఎస్పీ నారాయణరెడ్డి

image

ప్రజల భద్రతే పోలీసుల లక్ష్యమని ఎస్పీ నారాయణరెడ్డి పేర్కొన్నారు. బుధవారం వికారాబాద్ పట్టణంలోని రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, మార్కెట్ తదితర ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేశారు. తనిఖీల ద్వారా నేరాలను అడ్డుకట్ట వేయవచ్చని తెలిపారు. గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలు రవాణా కాకుండా ఉండేందుకు తనిఖీలు చేశామని చెప్పారు.

Similar News

News February 25, 2026

పార్వతీ దేవి అన్నపూర్ణగా ఎలా మారింది?

image

లోకానికి ఆహారం అందించే దేవత అన్నపూర్ణ దేవి. ఓసారి శివుడు ‘ఆహారం ఓ భ్రమ’ అన్నాడు. దీంతో కోపగించిన పార్వతీదేవి కాశీకి వెళ్లింది. దీంతో సకల జీవరాశులు ఆకలితో అలమటించాయి. అప్పుడు ఆహారం ప్రాముఖ్యం అర్థమైన శివుడు కాశీకి వెళ్లి అమ్మవారిని భిక్ష అడుగుతాడు. పరమేశ్వరుడికే అన్నం పెట్టడంతో ఆ తల్లి ‘అన్నపూర్ణ’గా ప్రసిద్ధి చెందింది. ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం వల్ల ఆ తల్లి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం.

News February 25, 2026

607 పోస్టులు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

image

నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్‌(NLCIL)లో 607 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి గడువు నేటితో ముగియనుంది. ఐటీఐ అర్హత గల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల కనీస వయసు 18 ఏళ్లు నిండి ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.11,040 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.nlcindia.in

News February 25, 2026

ఇంట్లోకి ఉడుము ప్రవేశిస్తే?

image

ఇంట్లోకి ఉడుము ప్రవేశించడాన్ని ఉపద్రవానికి సూచనగా పరిగణిస్తారు. దీనివల్ల దాచుకున్న సంపద కోల్పోవడం, అనవసర నిందలు, కోర్టు చిక్కులు ఎదురయ్యే ప్రమాదం ఉందని పండితులు చెబుతారు. వారి సూచన ప్రకారం.. ఉడుము ఇంట్లోకి వస్తే సురక్షితంగా బయటకు పంపాలి. అనంతరం ఇంటిని శుద్ధి చేసి పుణ్యావచనం చేయించాలి. దోష శాంతి కోసం విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. ఏకాహం నిర్వహిస్తే ఆపదలు తొలగి ఆర్థిక, మానసిక స్థిరత్వం లభిస్తుంది.