News October 25, 2025
ప్రజల భద్రత కోసం పటిష్ఠ చర్యలు: అనకాపల్లి ఎస్పీ

తుఫాను హెచ్చరిక నేపథ్యంలో ప్రజల భద్రత కోసం అనకాపల్లి జిల్లా పోలీసులు అన్ని అవసరమైన చర్యలను చేపట్టారని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. శనివారం ఆయన తన కార్యాలయం నుంచి మాట్లాడారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. స్థానిక అధికారుల సూచనలు ప్రజలు తప్పకుండా పాటించాలన్నారు.
Similar News
News October 26, 2025
ICC ర్యాంకింగ్స్‌లో రోహిత్ నం.1!

ఆస్ట్రేలియాతో సిరీస్‌లో అదరగొట్టిన రోహిత్ శర్మ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నం.1 స్థానం దక్కించుకోనున్నారు. ప్రస్తుతం 745 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్న హిట్‌మ్యాన్ తాజా సిరీస్‌లో 202 రన్స్ చేయడంతో నం.1కు వెళ్లినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 29న ఐసీసీ అధికారికంగా ర్యాంకులను ప్రకటించనుంది. అటు గిల్ (768 పాయింట్లు), జర్దాన్ (764 పాయింట్లు) టాప్-2లో ఉన్నారు.
News October 26, 2025
ఈ గుణం ఉంటేనే భగవంతుని ప్రేమ దక్కుతుంది

భగవద్భక్తిలో సంపూర్ణ విశ్వాసం పొందాలంటే మానవుడు సత్వ గుణాన్ని పెంచుకొని, రజో-తమో గుణాలను తగ్గించుకోవాలని వేమన పద్యాల్లో పేర్కొన్నారు. ‘త్రిగుణాల ప్రభావం దేవుళ్లపై స్పష్టంగా ఉంటుంది. సత్వగుణం కలవారు దేవున్ని నమ్ముతారు. రజోగుణం కలవారు ‘దేవుడు ఉన్నాడా, లేడా’ అనే సందేహంతో ఊగిసలాడతారు. తమోగుణం కలవారికి కష్టాలు వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడు, ఇతర వేళల్లో దేవుడు లేడని వాదిస్తారు’ అని రాశారు. <<-se>>#WhoIsGod<<>>
News October 26, 2025
వాయుగుండం.. భారీ వర్షాలు

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నేడు తీవ్ర వాయుగుండంగా, రేపటికి తుఫానుగా మారే అవకాశం ఉందని IMD తెలిపింది. రేపు అర్ధరాత్రి లేదా ఎల్లుండి తీవ్ర తుఫానుగా మారనుందని అంచనా వేసింది. ఈ నెల 28న సాయంత్రం తీరం దాటే ఆవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఇవాళ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు, రేపు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వానలు కురుస్తాయని తెలిపింది.


