News November 26, 2025
ప్రజల మహోన్నత శక్తి.. రాజ్యాంగం!

ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ, హక్కులు, అవకాశాలు, అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు లభించడానికి కారణం రాజ్యాంగం. 200ఏళ్లు బ్రిటిష్ పాలనలో మగ్గిన ప్రజలకు మహోన్నత శక్తినిచ్చింది ఈ రాజ్యాంగమే. అంబేడ్కర్ అధ్యక్షతన ఏర్పడిన కమిటీ రాజ్యాంగాన్ని రచించింది. దీనికి 1949 NOV 26న ఆమోదం లభించింది. అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా 2015లో NOV 26న రాజ్యాంగ దినోత్సవంగా కేంద్రం ప్రకటించింది. అప్పటి నుంచి ఏటా నిర్వహిస్తున్నారు.
Similar News
News November 26, 2025
ఏలూరు: ఒడిశా టూ హైదరాబాద్ అక్రమ రవాణా

పోలవరం డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జీలుగుమిల్లి పోలీసులు బుధవారం నిర్వహించిన విస్తృత వాహన తనిఖీల్లో గోవుల అక్రమ రవాణా వెలుగుచూసింది. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా లారీలో తరలిస్తున్న గోవులను గుర్తించి పట్టుకున్నారు. గోవులను సురక్షిత ప్రాంతానికి తరలించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
News November 26, 2025
సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవాలి: సీఎం చంద్రబాబు

AP: నిరంతర శ్రమ, సరైన నిర్ణయాలు తీసుకుంటే అనుకున్నది సాధించగలమని సీఎం చంద్రబాబు అన్నారు. ‘స్టూడెంట్స్ అసెంబ్లీ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు ఎక్కడా తడబడకుండా మాక్ అసెంబ్లీలో చక్కగా మాట్లాడారని ప్రశంసించారు. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. అనుకున్న లక్ష్యం నెరవేరాలంటే కష్టపడాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రజల గుండెల్లో అంబేడ్కర్ శాశ్వతంగా నిలిచిపోతారన్నారు.
News November 26, 2025
IIIT-నాగపుర్‌లో ఉద్యోగాలు

<


