News August 15, 2025
‘ప్రజల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వ పాలన’

ఖమ్మం: ప్రజల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని Dy.CM భట్టి విక్రమార్క అన్నారు. జిల్లాలో నూతనంగా 24 వేల 818 కుటుంబాలకు రేషన్ కార్డ్‌లు జారీ చేశామని చెప్పారు. 3,37,898 మంది రైతుల ఖాతాలో రూ. 427 కోట్ల 38 లక్షల రైతు భరోసా నిధులు జమ చేసామని తెలిపారు. అలాగే జిల్లాలో 16 వేల 153 మంది లబ్దిదారులకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిందని పేర్కొన్నారు.
Similar News
News August 15, 2025
సబ్బవరం: వివరాలు చెపితే రూ.50వేల బహుమతి

సబ్బవరం మండలం బాట జంగాలపాలెంలో ఈనెల 13వ తేదీ రాత్రి పాక్షికంగా కాలిన గుర్తు తెలియని మహిళ వివరాలు తెలియజేస్తే రూ.50,000 బహుమతిగా అందజేస్తామని సబ్బవరం పోలీసులు ప్రకటించారు. మృతురాలు ఊహాచిత్రాన్ని విడుదల చేశారు. మెడలో రోల్డ్ గోల్డ్ నల్లపూసలు, తాయెత్తు, కాళ్ల వేళ్లకు మెట్టెలు ధరించి ఉందన్నారు. పింక్ గ్రీన్ బ్లాక్ డిజైన్ నైటీలో ఉందన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు.
News August 15, 2025
ఏలూరు: వ్యవసాయ శాఖకు ప్రథమ బహుమతి

ఏలూరులో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి, కలెక్టర్ వెట్రిసెల్వి స్టాల్స్‌ను పరిశీలించారు. జిల్లా వ్యవసాయ సాధికారిక సంస్థ మొదటి బహుమతి, ఉద్యానవన శాఖ రెండో బహుమతి, మహిళా శిశు సంక్షేమ శాఖ మూడో బహుమతి, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ నాలుగో బహుమతి గెలుచుకున్నాయి.
News August 15, 2025
GST శ్లాబ్స్ 5 నుంచి 2కి తగ్గింపు?

ప్రస్తుతం <<17409983>>GST<<>>లో 5 శ్లాబ్స్ (0%, 5%, 12%, 18%, 28%) ఉండగా కేంద్రం వాటిని 2కి (5%, 18%) తగ్గించనున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. లగ్జరీ, సమాజానికి హాని చేసే పొగాకు, పాన్ మసాలా లాంటి ఐటమ్స్‌ను ప్రత్యేకంగా 40% జీఎస్టీలోకి తెచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం 12% శ్లాబ్‌లో ఉన్న 99 శాతం వస్తువులను 5% శ్లాబ్‌లోకి, 28% శ్లాబ్‌లో ఉన్న 90 శాతం వస్తువులను 18% శ్లాబ్‌లోకి మార్చే ఛాన్స్ ఉంది.