News October 12, 2025
ప్రజల సౌకర్యార్థం రేపు డివిజన్లలో ప్రజావాణి: కలెక్టర్ జితేష్ వి పాటిల్

భద్రాద్రి జిల్లా ప్రజల సౌకర్యార్థం సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని కలెక్టర్ కార్యాలయంలో కాకుండా డివిజన్ల వారీగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. భద్రాచలం డివిజన్ పరిధిలోని ప్రజలు సబ్ కలెక్టర్ కార్యాలయంలో, కొత్తగూడెం డివిజన్ పరిధిలోని ప్రజలు ఆర్డీఓ కార్యాలయంలో జరిగే ప్రజావాణిలో పాల్గొనాలని ఆయన కోరారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
Similar News
News October 12, 2025
APలో బీచ్‌కెళ్లిన ముగ్గురు హైదరాబాదీలు మృతి

బాపట్లలోని చీరాల బీచ్‌లో హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు యువకులు చనిపోయారు. AP పోలీసుల వివరాలు.. నగరానికి చెందిన శ్రీసాకేత్, సాయిమణిదీప్, జీవన్ సాత్విక్ అమరావతిలోని విట్‌లో చదువుతున్నారు. ఆదివారం సాయంత్రం కాలేజీ ఫ్రెండ్స్‌తో కలిసి బీచ్‌కు వెళ్లారు. స్నానం చేస్తుండగా అలల తాకిడికి సముద్రంలో గల్లంతు అయ్యారు. గాలింపు చేపట్టగా శ్రీసాకేత్, సాయిమణిదీప్, జీవన్ సాత్విక్ మృతదేహాలు లభ్యమయ్యాయి.

నిబంధనలు ఉల్లంఘిస్తే బాణాసంచా దుకాణాలపై కఠిన చర్యలు: ఎస్పీ

అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా బాణాసంచా నిల్వ ఉంచినా, విక్రయించినా చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ (ఐపీఎస్) ఆదివారం హెచ్చరించారు. బాణాసంచా దుకాణం వద్ద నీరు, ఇసుక, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ వంటి అగ్నిమాపక పరికరాలు తప్పనిసరిగా ఉంచాలన్నారు. విక్రయాలలో మైనర్లను వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.