News October 30, 2024
ప్రజాభవన్‌లో ప్రజావాణికి 588 దరఖాస్తులు

ప్రజాభవన్‌లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 588 దరఖాస్తులు అందాయి. మైనారిటీ వెల్ఫేర్ శాఖకు సంబంధించి 221, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు 98, విద్యుత్ శాఖకు 84, రెవెన్యూ పరమైన సమస్యలపై 55, ప్రవాసీ ప్రజావాణి ద్వారా 4, ఇతర శాఖలకు 126 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ డా.చిన్నారెడ్డి, ప్రజాపాలన ప్రత్యేకఅధికారి దివ్య పాల్గొన్నారు.
Similar News
News November 4, 2025
HYD: ఆపండయ్యా మీ రాజకీయం.. ‘ఆడ’పిల్లలను ఆదుకోండి!

మీర్జాగూడ ఘటనపై నేతల హంగామా తీవ్ర విమర్శలకు దారి తీసింది. మృతదేహాల మధ్య హైవే సాంక్షన్ చేశామని ఒకరు, నిధులు మంజూరు చేశామని మరొకరు, పనులు మొదలుపెట్టిందే మేమని ఇంకొకరు గొప్పలు చెప్పుకున్నారు. ‘ఎంత చెప్పినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ పేద కుటుంబం పెద్దలను కోల్పోయింది. ఆడపిల్లలు రోడ్డున పడ్డారు. గతాన్ని మార్చలేము. యాలాలలోని హాజీపూర్‌లో అనాథలైన <<18187789>>భవానీ, శివాలీ<<>>ని ఆదుకోండి’ అంటూ ప్రజలు కోరుతున్నారు.
News November 4, 2025
గచ్చిబౌలి: కో-లివింగ్‌లో RAIDS.. 12 మంది అరెస్ట్

గచ్చిబౌలి TNGOకాలనీలోని కో-లివింగ్ రూమ్స్‌లో పోలీసులు మెరుపుదాడులు చేశారు. డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న 12 మందిని SOT పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక నుంచి డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తోన్న గుత్తా తేజతో పాటు మరో నైజీరియన్ హైదరాబాద్ యువతకు అమ్ముతున్నట్లు గుర్తించారు. ఈ రైడ్స్‌లో ఆరుగురు డ్రగ్ పెడ్లర్స్, ఆరుగురు కన్జ్యూమర్స్‌ను అదుపులోకి తీసుకున్నారు. MDMAతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
News November 4, 2025
HYD: పిల్లలకు ఇక నుంచి టిఫిన్!

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌లోని 3,253 అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల కోసం ఉదయం అల్పాహార పథకం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం ద్వారా సుమారు 1.50 లక్షల మంది చిన్నారులు లబ్ధి పొందనున్నారు. పిల్లల ఆరోగ్యం, పౌష్టికాహారంలో మెరుగుదలతో పాటు పాఠశాల హాజరును పెంచడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. మెనూలో ఇడ్లీ, ఉప్మా, రాగి జావ, అటుకుల ఉప్మా వంటి వంటకాలు ఉండనున్నాయి. ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం.


