News April 12, 2025
ప్రజారోగ్యానికి ప్రభుత్వం భరోసా.. రూ.85 కోట్లు మంజూరు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.85 కోట్లు మంజూరు చేసిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. TG సెక్రటేరియట్‌లో మంత్రి దామోదర్ రాజనరసింహ అధ్యక్షతన శుక్రవారం సమీక్షా సమావేశం జరిగింది. షబ్బీర్ అలీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి ఈ నిధులను మంజూరు చేసినట్లు చెప్పారు.
Similar News
News February 25, 2026
కామారెడ్డి: ఇంటర్, పదో తరగతి పరీక్షలు.. టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు

కామారెడ్డి జిల్లాలో ఇంటర్, పదో తరగతి పరీక్షలను పకడ్బందీ ఏర్పట్లు చేసినట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. మంగళవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలో ఇంటర్ పరీక్షలకు సంబంధించి ఏమైనా సందేహాలు, సలహాలు సూచనలకు 9866143782, 9948164514 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలన్నారు.
News February 25, 2026
NIMSలో CMRF ద్వారా రూ.521 కోట్ల విలువచేసే వైద్యం

పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రిలో సీఎంఆర్ ఫండ్ ద్వారా అనేకమందికి నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని డైరెక్టర్ బీరప్ప తెలిపారు. 2 సంవత్సరాల్లో ఎల్‌ఓసీల ద్వారా రూ.521 కోట్లకు పైగా విలువైన చికిత్సలు అందించినట్లు వెల్లడించారు. వెన్నెముక శస్త్రచికిత్సలు సైతం నిర్వహించామని, ముఖ్యంగా న్యూరో సర్జరీ కేసులు 2,221 నమోదైనట్లు పేర్కొన్నారు. పేద రోగులకు ఇది గొప్ప ఉపశమనం కలిగిస్తున్నట్లు వివరించారు.
News February 25, 2026
సంగారెడ్డి: ‘TG-iPASS ద్వారా వేగంగా అనుమతులు’

పరిశ్రమల అనుమతుల ప్రక్రియలో జాప్యం లేకుండా TG-iPASS విధానం ద్వారా పారదర్శకంగా, వేగంగా అనుమతులు మంజూరు చేయాలని అధికారులను కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ముఖ్యంగా కాలుష్య నియంత్రణ మండలి అనుమతుల విషయంలో అధికారులు ఖచ్చితత్వంతో వ్యవహరించాలని, నిబంధనల ప్రకారం దరఖాస్తులను తనిఖీ చేసి త్వరగా పరిష్కరించాలని సూచించారు.


