News November 10, 2025
ప్రజావాణికి 158 వినతులు.. సత్వర పరిష్కారంపై కలెక్టర్ ఆదేశం

హన్మకొండ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి 158 వినతి పత్రాలు అందినట్లు అధికారులు తెలిపారు. కలెక్టర్ స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి అర్జీలను స్వీకరించి, సత్వర పరిష్కారం కోసం సంబంధించిన శాఖలకు పంపించారు. గ్రీవెన్స్ వినతులను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
Similar News
News November 10, 2025
శ్రీరాంపూర్: స్ట్రక్చర్ సమావేశంలో పలు ఒప్పందాలు

గుర్తింపు ఏఐటీయూసీ సంఘం, సింగరేణి యాజమాన్యంకు Hydలో జరిగిన స్ట్రక్చర్ కమిటీలో పలు ఒప్పందాలపై నిర్ణయాలు తీసుకున్నట్లు యూనియన్ నాయకులు తెలిపారు. 150 మస్టర్ల ఆప్సెంటేజం సర్కులర్‌పై గత విధానాన్ని కొనసాగించడానికి అంగీకరించారు. బదిలీ వర్కర్లుగా అపాయింట్మెంట్ అవుతున్న ఉద్యోగులందరూ జనరల్ అసిస్టెంట్ ట్రేనీగా నియమించబడతారు. మెడికల్ బోర్డు, ప్రభుత్వ అనుమతి అనంతరం పెరిక్స్పై ఐటీ యాజమాన్యమే భరిస్తుంది.
News November 10, 2025
భోజనం చేసిన వెంటనే ఈ 5 పనులు చేయొద్దు!

భోజనం చేసిన వెంటనే కొన్ని పనులు చేయవద్దని, దానివల్ల ఆరోగ్యానికి మంచిది కాదని డాక్టర్లు చెబుతున్నారు.
*స్నానం చేయవద్దు. దీనివల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. 2 గంటల తర్వాత స్నానం చేయవచ్చు.
*వెంటనే నిద్రపోవద్దు. 20 నిమిషాల పాటు నడవాలి.
*చల్లటి నీరు తాగవద్దు. గోరువెచ్చని లేదా జీలకర్ర-ధనియాల కషాయం తాగాలి.
*తిన్న వెంటనే పండ్లు తినవద్దు. గంట ముందు లేదా 2 గంటల తర్వాత తినొచ్చు.
*వ్యాయామం చేయవద్దు.
News November 10, 2025
మీర్జాగూడ ఘటన.. టిప్పర్ డ్రైవర్ కుటుంబానికి ఆర్థిక సాయం

చేవెళ్ల పరిధి మీర్జాగూడ గేట్ సమీపంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన టిప్పర్ డ్రైవర్, నాందేడ్ జిల్లా వాసి ఆకాశ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును ఈరోజు చేవెళ్ల క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అందజేశారు.


