News July 8, 2025

ప్రజావాణిలో సమస్యల పరిష్కారానికి ఆదేశం

image

భద్రాద్రి కొత్తగూడెంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, విద్యా చందనతో కలిసి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి ప్రజల ఫిర్యాదులు స్వీకరించారు. ప్రతి దరఖాస్తును సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. శారీరక వికలాంగుడు రాహుల్‌కు ఉపాధి, అనసూర్యకు ఇళ్లు, వెంకటేశ్వర్లుకు ఉచిత విద్యుత్ అందించాలని ఆదేశించారు.

Similar News

News July 8, 2025

గోదావరికి వరద ఉద్ధృతి

image

AP: శబరి, సీలేరు వరదతో గోదావరి నదిలో ప్రవాహం పెరిగింది. పోలవరం ప్రాజెక్టు వద్ద 48 గేట్లు ఎత్తి 1.95 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు. అటు ధవళేశ్వరం బ్యారేజీకి 2.05 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. మహారాష్ట్రలో వర్షాలు మరింత ఊపందుకుంటాయని, 3-4 రోజుల్లో వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

News July 8, 2025

ఈ లక్షణాలుంటే కఠిక పేదరికమే: చాణక్య నీతి

image

ఏ ఇంట్లో స్త్రీకి సముచిత స్థానం, తగిన మర్యాద దక్కదో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదని చాణక్య నీతి చెబుతోంది. అహంకారం, మోసం చేసే గుణాలున్న వారు మొదట లాభపడవచ్చు. కానీ, వారింట లక్ష్మి నిలవదు. పరిస్థితిని అంచనా వేయకుండా నోటికొచ్చినట్లు మాట్లాడే వ్యాపారి, ఉద్యోగి ఇబ్బందులు పడక తప్పదు. అలాంటి వారికి లక్ష్మీ కటాక్షం ఉండదని చాణక్య నీతిలో ఉంది.

News July 8, 2025

‘రేషన్ కార్డుదారులు ఈ కేవైసీ చేయించుకోవాలి’

image

ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలనుసారం రేషన్ కార్డుదారులందరు ఆయా రేషన్ షాపులలో ఈ-కేవైసీ చేయించుకోవాలని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి చందన్ కుమార్ తెలిపారు. జిల్లాలోని 4,15,905 రేషన్ కార్డులకుగాను 12,03,943 మంది ఉన్నారు. ఇందులో 9,64,236 మంది మాత్రమే ఈ-కేవైసీ చేయించుకున్నారని చెప్పారు. మిగిలిన వారందరూ వెంటనే సమీపంలోని రేషన్ దుకాణాల్లో ఈ-కేవైసీ చేయించాలని సూచించారు.