News September 15, 2025
ప్రజావాణిలో 90 దరఖాస్తులు స్వీకరణ: కలెక్టర్

జనగామలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 90 దరఖాస్తులు స్వీకరించినట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ప్రజా విజ్ఞప్తులను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నాని అన్నారు. ప్రజావాణితో ఎంతో మంది సమస్యలు పరిష్కారం అవుతున్నాయని, ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రజావాణిలో ఫిర్యాదు చేయొచ్చని సూచించారు. అదనపు కలెక్టర్లు బెన్షా లోమ్, పింకేశ్ కుమార్ పాల్గొన్నారు.
Similar News
News September 15, 2025
NRPT: ‘ANMలను NCD ఆన్‌లైన్ ప్రోగ్రామ్ నుంచి తొలగించాలి’

ఎన్‌సీడీ ఆన్‌లైన్ ప్రోగ్రామ్ నుంచి ఏఎన్ఎం (ANM)లను తొలగించాలని కోరుతూ సోమవారం నారాయణపేట కలెక్టరేట్‌లో కలెక్టర్ సిక్తా పట్నాయక్‌కు ఏఎన్‌ఎంలు వినతిపత్రం సమర్పించారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జోషి మాట్లాడుతూ.. ఆన్‌లైన్ ప్రోగ్రామ్ వల్ల ఏఎన్‌ఎంలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రోజుకు 12 గంటల సమయం దీనికే సరిపోతోందని తెలిపారు. దీనివల్ల ఒత్తిడికి గురై అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పారు.
News September 15, 2025
NRPT: ఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్ సమీక్ష

ఎలక్టర్ మ్యాపింగ్ టేబుల్‌ను పకడ్బందీగా తయారు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తహశీల్దార్లకు సూచించారు. త్వరలో భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఎస్.ఐ.ఆర్ షెడ్యూల్ విడుదల చేయనున్న నేపథ్యంలో బీఎల్వోలు అన్ని వివరాలతో సిద్ధంగా ఉండాలని చెప్పారు. కొత్త పోలింగ్ కేంద్రాల ప్రతిపాదన ఉన్న చోట వారికి శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు.
News September 15, 2025
సూపర్-4కు దూసుకెళ్లిన టీమిండియా

ఆసియా కప్‌లో టీమిండియా సూపర్-4కు దూసుకెళ్లింది. తాజాగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో UAE ఘన విజయం సాధించడంతో భారత్‌కు లైన్ క్లియర్ అయింది. టీమిండియా ఇప్పటికే UAE, పాక్‌పై విజయం సాధించిన విషయం తెలిసిందే. మెరుగైన నెట్ రన్‌రేట్(4.793) కారణంగా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సూపర్-4కు అర్హత సాధించింది. రెండో బెర్త్ కోసం పాక్, UAE పోటీ పడనున్నాయి.