News March 6, 2025

ప్రజావాణి అర్జీలపై ప్రత్యేక చర్యలు: MNCL కలెక్టర్

image

ప్రజావాణిలో వచ్చే దరఖాస్తుల పరిష్కారంపై రెవెన్యూ, పోలీసు శాఖల సమన్వయంతో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. బుధవారం మంచిర్యాల కలెక్టరేట్‌లో డీసీపీ ఎ.భాస్కర్, అదనపు కలెక్టర్ మోతిలాల్‌తో కలిసి నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో అందిన దరఖాస్తులను కనీసం 15 రోజులు, గరిష్ఠంగా 21 రోజుల్లోగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.

Similar News

News November 4, 2025

కమలాపురం: హత్య కేసులో నిందితునికి రిమాండ్ విధింపు

image

కమలాపురం మండలం అప్పారావు పల్లెలో జరిగిన హత్య కేసులో నిందితుడిని సోమవారం పోలీసుల అరెస్టు చేశారు. సీఐ రోషన్ వివరాలు.. ‘చెన్నారెడ్డి, విశ్వనాథ్ రెడ్డిలు అన్నదమ్ములు. విశ్వనాథరెడ్డి మద్యానికి అలవాటుపడి చెన్నారెడ్డి ఆస్తిలో కొంత ఇవ్వాలని తరచూ గొడవ పడేవాడు. ఇందుకు తమ్ముడు ఒప్పుకోకుండా విశ్వనాథ్ రెడ్డిని బలంగా కొట్టడంతో చనిపోయాడు’. దీంతో నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు.

News November 4, 2025

వీళ్ల పంచాయితీ కొలిక్కి వచ్చేనా?

image

విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ ఇవాళ మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో క్రమశిక్షణ సంఘం ముందు హాజరుకానున్నారు. ఉదయం 11గం కొలికిపూడి, మధ్యాహ్నం 4గంటలకు చిన్నీ హాజరవుతారు. పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అధ్యక్షతన కమిటీ సభ్యులు నేతల వివరణలు తీసుకోనున్నారు. మరి సంఘం ఇచ్చిన నివేదిక ప్రకారం సీఎం చర్యలు తీసుకుంటారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.

News November 4, 2025

వంటింటి చిట్కాలు

image

*మరమరాలు మెత్తబడినప్పుడు రెండు నిమిషాలు వేయిస్తే మళ్లీ కరకరలాడతాయి.
* చేపను ఒక రోజు కంటే ఎక్కువ నిల్వ చేయాలంటే ముక్కలుగా కోసి ఉప్పు, వెనిగర్ పట్టించి డీప్ ఫ్రిజ్‌లో ఉంచాలి.
* ఉసిరికాయ నిల్వ పచ్చడి నలుపెక్కకుండా ఉండాలంటే జాడీలో పెట్టిన తర్వాత మధ్యలో ఇంగువ ముక్క ఉంచండి.
* బెండకాయలు 2, 3 రోజులు తాజాగా ఉండాలంటే తొడిమలతో పాటు రెండో చివరను కూడా కోసి ప్లాస్టిక్ బ్యాగ్‌లో వేసి ఫ్రిజ్‌లో పెట్టాలి.