News April 22, 2025

ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి: అదనపు కలెక్టర్

image

MBNR ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన 92 ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించి నివేదిక ఇవ్వాలని అధికారులను అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశంలో ఫిర్యాదులను స్వీకరించారు. ఏ వారం ఫిర్యాదులను ఆ వారమే పరిష్కరించాలని నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. భూ సమస్యలపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు.

Similar News

News September 9, 2025

తెలుగు యూనివర్శిటీ తొలి Ph.D అందుకున్నది పాలమూరు వ్యక్తే!

image

MBNRకు చెందిన కపిలవాయి లింగమూర్తి TG ఏర్పడ్డ తర్వాత తెలుగు వర్శిటీ నుంచి డాక్టరేట్‌ అందుకున్న తొలి వ్యక్తి. సుమారు 7 దశాబ్దాల పాటు తెలుగు సాహిత్య రంగానికి ఆయన చేసిన విశేష సేవలను గుర్తించి 2014లో తెలుగు యూనివర్శిటీ 13వ స్నాతకోత్సవంలో ఆయనకు గౌరవ డాక్టర్‌ ఆఫ్‌ లిటరేచర్‌ (డీలిట్‌)ను ప్రదానం చేసింది. ప్రతిభ పురస్కారం కూడా అందుకున్నారు. నేడు TG భాషా దినోత్సవం సందర్భంగా Way2News ప్రత్యేక కథనం.

News September 8, 2025

14న లోక్ అదాలత్.. సద్వినియోగం చేసుకోండి- SP జానకి

image

త్వరిత న్యాయం కోసం జాతీయ మెగా లోక్ అదాలత్ ఈనెల 14న నిర్వహిస్తున్నట్లు మహబూబ్ నగర్ ఎస్పీ డి.జానకి తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ.. ‘రాజీయే రాజమార్గం.. చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బును వృథా చేసుకోవద్దని, జుడీషియల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి, ఈ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని’ అన్నారు.

News September 8, 2025

MBNR: 3,000 విగ్రహాల నిమజ్జనం ప్రశాంతం: ఎస్పీ

image

మహబూబ్‌నగర్ జిల్లాలో గణేశ్ నిమజ్జన కార్యక్రమాలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిశాయని ఎస్పీ డి.జానకి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 3,000 విగ్రహాలను నిబంధనల ప్రకారం వివిధ చెరువులు, శివార్లలో నిమజ్జనం చేశారని ఆమె చెప్పారు. కొద్ది రోజులుగా భక్తిశ్రద్ధలతో జరిగిన గణేశ్ ఉత్సవాలు, అనంతరం నిమజ్జన కార్యక్రమాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముగిశాయని పేర్కొన్నారు.