News March 17, 2025
ప్రజావాణి రద్దు: జనగామ కలెక్టర్

జనగామ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ప్రకటనలో తెలిపారు. అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్‌లో భాగంగా ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి వినతులు ఇచ్చేందుకు కలెక్టరేట్‌కు రావొద్దన్నారు.
Similar News
News March 17, 2025
నిరుద్యోగ యువత అప్లై చేసుకోవాలి: పీవో

రాజీవ్ యువ వికాసం పథకం కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగ గిరిజన యువత స్వయం ఉపాధి పొందడానికి దరఖాస్తు చేసుకోవాలని భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత, ఆసక్తిగల గిరిజన నిరుద్యోగులు https://tgobmmsnew.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా ఏప్రిల్ 5 లోపు అప్లై చేసుకోవాలని సూచించారు. మరింత సమాచారం కోసం ఎంపీడీవో కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు.
News March 17, 2025
VZM: ఆరుగురిపై కేసు నమోదు

ఖాళీ ప్రదేశాల్లో మద్యం తాగుతూ ప్రజాశాంతికి భంగం కలిగించే వారిపై విజయనగరం జిల్లా పోలీసులు దృష్టి సారించారు. నిర్మానుష్య ప్రాంతాల్లో నిఘా పెట్టి వారిని పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నారు. ఆదివారం సంతకవిటి మండలం గుళ్ల సీతారాంపురం శివారులో బహిరంగంగా మద్యం తాగుతున్న వారిపై రాజాం పోలీసులు దాడులు చేశారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న ఆరుగురు మందుబాబులపై కేసు నమోదు చేశారు.
News March 17, 2025
కర్నూలు: ఉరి వేసుకొని వ్యక్తి మృతి

కర్నూలు జిల్లా మంత్రాలయం మండల కేంద్రంలో ఆదివారం గుర్తు తెలియని ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామ శివారులోని మెలిగుట్ట దగ్గర ఓ చెట్టుకు ఉరి వేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. శరీరం గుర్తుపట్టని విధంగా ఉంది. మృతుని ఆచూకీ తెలిసినవారు ఎస్ఐ 9121101152కి సంప్రదించాలని సూచించారు.