News January 28, 2026

ప్రజాశాంతికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు: ఎస్పీ

image

ప్రజాశాంతికి విఘాతం కలిగించే వారిపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ పి.జగదీశ్ స్పష్టం చేశారు. బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన పుట్లూరు మండలం గరుగుచింతలపల్లికి చెందిన రౌడీషీటర్ మంజుల నవీన్‌పై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఇతనిపై 2014 నుంచి 12 కేసులు ఉండగా, గతంలో పీడీ యాక్టు కూడా నమోదైంది. నిబంధనలు అతిక్రమించినందుకు గాను బైండోవర్ ష్యూరిటీగా ఉన్న రూ. 50 వేల నగదును తహశీల్దార్ ద్వారా జరిమానాగా కట్టించారు.

Similar News

News January 29, 2026

జిల్లాలో బార్ల ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల

image

అనంతపురం జిల్లాలో కొత్త బార్ పాలసీలో భాగంగా 7 బార్ల దరఖాస్తులకు ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అనంతపురంలో మూడు, గుంతకల్లులో రెండు, తాడిపత్రి, రాయదుర్గంలో ఒక్కో బార్ కోసం జిల్లా ఎక్సైజ్ అధికారి రామమోహన్ రెడ్డి గెజిట్ విడుదల చేశారు. ఫిబ్రవరి 4న దరఖాస్తులు స్వీకరించి, 5న లాటరీ నిర్వహిస్తారు. అప్లికేషన్ కోసం రూ.5లక్షల డీడీ చెల్లించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

News January 29, 2026

ఆర్డీటీ స్టేడియంలో క్రికెటర్ నితిన్ కుమార్ సందడి

image

భారత క్రికెటర్ నితిన్ కుమార్ అనంతపురం నగరంలోని ఆర్డీటీ స్టేడియంను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి చిన్నారులను అప్యాయంగా దగ్గరకు పిలుచుకుని వారితో సరదాగా ఫొటోలు దిగారు. అనంతరం బ్యాట్‌పై ఆటోగ్రాఫ్ చేసి ఆలూరు విరాట్ అనే బాలుడికి బహుమతిగా అందజేశారు. స్టార్ క్రికెటర్ తమతో సమయం గడపడమే కాకుండా, సిగ్నేచర్ చేసిన బ్యాట్ ఇవ్వడంతో చిన్నారులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

News January 29, 2026

ఓ పక్క కానిస్టేబుల్ ట్రైనింగ్.. మరోపక్క గ్రూప్స్-2 ఉద్యోగం

image

తాడిపత్రిలోని నందలపాడుకు చెందిన ఇల్లూరు ప్రవీణ్ కుమార్ గ్రూప్-2 ఉద్యోగం సాధించాడు. ప్రవీణ్ కుమార్ ఎక్కడా కోచింగ్‌కు వెళ్లకుండా సొంతగా గ్రూప్స్‌కు ప్రిపేర్ అయ్యారు. కాగా, మొన్న విడుదల చేసిన కానిస్టేబుల్ ఫలితాలలో పోస్టు సాధించి ప్రస్తుతం కడపలో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే గ్రూప్స్-2లో పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం సాధించాడు.