News July 18, 2024

ప్రజాసేవకు విరమణ ఉండదు: కడియం

image

చిల్పూర్ మండల కేంద్రంలో గురువారం ఎంపీపీ, ఎంపీటీసీల పదవీ విరమణ వీడ్కోలు కార్యక్రమం నేడు ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పదవికి విరమణ ఉంటుంది తప్ప.. ప్రజాసేవకు విరమణ ఉండదని అన్నారు. పదవీ కాలం ముగిసిన ప్రతి రాజకీయ నాయకుడు ప్రజల్లోనే ఉండాలని సూచించారు. ఎంపీపీ, ఎంపీటీసీలను ఘనంగా సన్మానించారు.

Similar News

News October 2, 2024

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ చిహ్నం: మంత్రి

image

సుసంపన్నమైన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ చిహ్నమని మంత్రి కొండా సురేఖ అన్నారు. నేడు మహాలయ అమావాస్య (పెత్ర అమావాస్య)ను పురస్కరించుకుని మంత్రి సురేఖ మహిళా లోకానికి, తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమై, సద్దుల బతుకమ్మతో ముగిసే ఈ తొమ్మిది రోజుల పండుగతో తెలంగాణ పల్లెలు కొత్త కాంతులతో విరాజిల్లుతోందని మంత్రి అన్నారు.

News October 2, 2024

డోర్నకల్: ‘తండ్రి మరణాన్ని దిగమింగుకుని ఉద్యోగం సాధించాడు’

image

డోర్నకల్ మండలం వెన్నారం గ్రామానికి చెందిన వెగ్గళం విజయ్ డీఎస్సీలో జిల్లా స్థాయిలో 46వ ర్యాంక్ సాధించి ప్రతిభ కనపరిచాడు. అతని తండ్రి ప్రభాకర శాస్త్రి ఎగ్జామ్‌కి 3 రోజులకి ముందు మరణించాడు. ఆ మరణాన్ని దిగమింగుకుని పరీక్ష రాశాడు. SGT ఉద్యోగాన్ని సాధించడం కోసం ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డానని, తన 10 సంవత్సరాల నిరీక్షణ ఫలించిందని, తల్లిదండ్రుల కష్టానికి ప్రతిఫలం ఈ ఉపాధ్యాయ ఉద్యోగం అని విజయ్ అన్నారు.

News October 2, 2024

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నలుగురు ఎస్సైలు బదిలీలు

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నలుగురు ఎస్సైలను వివిధ పోలీస్ స్టేషన్లకు బదిలీ చేస్తూ మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్.కె హమిద్ వరంగల్ వి.ఆర్ నుంచి బచ్చన్నపేటకు, కె.సతీశ్ బచ్చన్నపేట నుంచి ఐటీ వరంగల్‌కు, బి.చందర్ వరంగల్ మిల్స్ కాలనీ నుంచి వర్ధన్నపేటకు, ఏ.ప్రవీణ్ కుమార్ వర్ధన్నపేట నుంచి కేయూ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.