News January 12, 2026
ప్రజాసేవే లక్ష్యంగా పనిచేసే సిద్ధాంతబద్ధమైన పార్టీ కాంగ్రెస్: వరంగల్ MP

కాంగ్రెస్ పార్టీ అంటే పదవుల కోసం కాదు, ప్రజాసేవే లక్ష్యంగా పనిచేసే సిద్ధాంతబద్ధమైన పార్టీ అని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. హనుమకొండ DCC ఆఫీస్‌లో ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఎంపీ హాజరై మాట్లాడారు. ప్రజలు కాంగ్రెస్‌పై పెట్టుకున్న విశ్వాసాన్ని మరింత పటిష్ఠం చేసే బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత కార్యకర్తలదేనని పేర్కొన్నారు.
Similar News
News February 21, 2026
మొదటి స్థానంలో స్టేషన్ ఘనపూర్: కడియం

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు 85 శాతం ప్రారంభించి, ఉమ్మడి జిల్లాలోనే స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం మొదటి స్థానంలో ఉందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శనివారం శ్రీపతిపల్లిలో ఇందిరమ్మ ఇంటిని ఎమ్మెల్యే ప్రారంభించారు. నిరుపేద ప్రజలు ఆత్మగౌరవంతో జీవించే విధంగా ప్రభుత్వం అందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తోందని, ఈ ఆర్థిక సంవత్సరంలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి మరో 3,500 ఇందిరమ్మ ఇల్లు రాబోతున్నాయన్నారు.
News February 21, 2026
AUSWపై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం

అడిలైడ్ వేదికగా జరిగిన <<19201544>>మూడో టీ20లో<<>> ఆస్ట్రేలియా మహిళల జట్టుపై 17 రన్స్ తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆసీస్ గడ్డపై భారత్‌కు ఇదే తొలి సిరీస్ విజయం. ఈ మ్యాచ్‌లో 177 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన ఆసీస్‌ను 159/9 స్కోరుకే పరిమితం చేసింది. ఆష్లీ గార్డనర్ 57, లిచ్‌ఫీల్డ్ 26 మినహా అందరూ విఫలమయ్యారు. శ్రీచరణి, శ్రేయాంక చెరో 3, అరుంధతి 2, రేణుక ఒక వికెట్ తీశారు.
News February 21, 2026
ట్రంప్‌కు బొమ్మ చూపించాడు!

విదేశాలపై టారిఫ్స్ వేసే అధికారం USA అధ్యక్షుడికి లేదని ఆ దేశ సుప్రీంకోర్టు చెప్పడం తెలిసిందేగా. USAలోని చిన్న బొమ్మల కంపెనీ ఓనర్ రిక్ ఈ తీర్పు కోసం పోరాడారు. తన లెర్నింగ్ రిసోర్సెస్ లిమిటెడ్ కంపెనీ చైనా నుంచి టాయ్స్ కొని USAలో వ్యాపారం చేస్తుంది. ట్రంప్ టారిఫ్స్‌తో నష్టపోయిన రిక్, తనలాంటి వ్యాపారులతో కలిసి కోర్టుకెళ్లి కేసు గెలిచారు. తమ నుంచి వసూలు చేసిన అదనపు సుంకం ఇవ్వాలనేది రిక్ తాజా డిమాండ్.


