News December 22, 2025

ప్రజా దివాస్ దరఖాస్తులపై తక్షణ చర్యలు చేపట్టాలి: ఎస్పీ

image

ప్రజా దివాస్ దరఖాస్తులపై తక్షణ చర్యలు చేపట్టాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. ప్రజా దివాస్ కార్యక్రమంలో భాగంగా ఈ సోమవారం భూపాలపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వయంగా స్వీకరించి పరిశీలించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మొత్తం 10 దరఖాస్తులను ఎస్పీ శ్రద్ధగా పరిశీలించి, సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు.

Similar News

News December 30, 2025

తమలపాకు తోటలకు తెగుళ్ల సమస్య

image

తీవ్రమైన తెగుళ్లు తమలపాకు తోటలకు శాపంగా మారాయి. వేరు, మొదలు కుళ్లు, ఆకు కుళ్లు పంటను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో వీటి సాగు విస్తీర్ణం క్రమంగా తగ్గుతోంది. మరోవైపు తమలపాకు తోటలకు నీడనిచ్చే అవిశ చెట్లకు నత్తల బెడద పెరిగింది. ఇవి అవిశ చెట్ల ఆకులను, తమలపాకులను తిని రంద్రాలు చేస్తున్నాయి. దీంతో అవిశ చెట్లు ఎండిపోయి, నీడ లేకపోవడం వల్ల తమలపాకుల నాణ్యత తగ్గి, ధర పడిపోతోంది.

News December 30, 2025

చైనా మాంజా అమ్మేవారి సమాచారమిస్తే రూ.5వేలు: దానం

image

TG: పతంగులు ఎగురవేయడంలో చైనా మాంజా వినియోగంపై పోలీసులు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయినా కొన్ని చోట్ల ఈ మాంజాను వినియోగిస్తున్నారు. దీనిని రహస్యంగా అమ్ముతున్నవారి సమాచారం తనకు ఇవ్వాలని ఖైరతాబాద్ MLA దానం నాగేందర్ ప్రజలను కోరారు. వారి వివరాలను గోప్యంగా ఉంచడమే కాకుండా రూ.5వేల ప్రైజ్ మనీ ఇస్తామని చెప్పారు. ఈ విషయంలో పోలీసులతో కలిసి దాడులు నిర్వహించి కేసులు పెట్టేలా చూస్తామని హెచ్చరించారు.

News December 30, 2025

న్యూ ఇయర్ వేళ విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు..

image

విశాఖలో నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా డిసెంబర్ 31 రాత్రి 8 గంటల నుంచి జనవరి 1 ఉదయం 5 గంటల వరకు పోలీసులు పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఫ్లైఓవర్లు, ఆర్కే బీచ్ రోడ్డు, BRTS రోడ్లపై వాహనాలకు అనుమతి లేదు. నిబంధనలు ఉల్లంఘించినా, మద్యం తాగి నడిపినా వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. బీచ్ సందర్శకులకు ఏయూ గ్రౌండ్స్, APIIC గ్రౌండ్, గోకుల్ పార్కుల్లో పార్కింగ్ కేటాయించామని ADCP ప్రవీణ్ కుమార్ తెలిపారు.