News February 3, 2025

ప్రజా పాలన కాదు.. పిచ్చి నారాయణ పాలన: కాకాణి

image

వైసీపీ మద్దతుదారుల ఇళ్లను నెల్లూరు మున్సిపల్ కమిషనర్ సూర్య తేజ మంత్రి నారాయణ సూచనలకు అనుగుణంగా ధ్వంసం చేస్తున్నారని మాజీ మంత్రి కాకాణి ఆరోపించారు. వైసీసీ నాయకుడు బాలకృష్ణారెడ్డి ఇంటిని అన్యాయంగా కూల్చారని, ఆయన అక్కడే ఏళ్లుగా ఉన్నారన్నారు. మంత్రి క్షేత్రస్థాయిలో పర్యటిస్తే.. ‘ఇది పిచ్చి నారాయణ పాలన అని ప్రజలే తమ గోడును వెల్లబోసుకుంటారని కాకాణి ఎద్దేవా చేశారు.

Similar News

News November 10, 2025

ట్రాన్స్‌జెండర్లకు ధ్రువీకరణ పత్రాలు, గుర్తింపు కార్డుల పంపిణీ

image

జిల్లా దివ్యాంగులు, వృద్ధులు, హిజ్రాల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సుమారు 30 మంది ట్రాన్స్‌జెండర్లకు కలెక్టర్‌ హిమాన్షు శుక్లా సోమవారం ధ్రువీకరణ పత్రాలు, గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. 2019 హిజ్రాల చట్టం ప్రకారం వారికి సమాజంలో గౌరవం కల్పించాలనే లక్ష్యంతో నేషనల్‌ పోర్టల్‌ ఫర్‌ ట్రాన్స్‌జెండర్‌ పర్సన్స్‌ పోర్టల్‌ ద్వారా వీటిని మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.

News November 10, 2025

జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మకు మాతృవియోగం

image

నెల్లూరు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ మాతృమూర్తి కోడూరు సరస్వతమ్మ గత రాత్రి మృతి చెందారు. దివంగత కోడూరు అయ్యప్ప రెడ్డి సతీమణి వైసీపీ నెల్లూరు రూరల్ ఇన్‌ఛార్జ్ ఆనం విజయకుమార్ రెడ్డి అత్త గత అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో మృతి చెందారు. సోమవారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు బాలాజీ నగర్‌లో అంతిమయాత్ర సాగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

News November 10, 2025

జిల్లా వ్యాప్తంగా హోటల్స్, లాడ్జిల్లో ముమ్మర తనిఖీలు

image

SP డా అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా 77 ప్రత్యేక బృందాలతో హోటల్స్, లాడ్జిల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో నగరంలోని సంతపేట పరిధిలోని ఓ లాడ్జ్‌లో ఆకస్మిక తనిఖీ చేయగా, ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి 6 KGల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలు అరికట్టడానికి లాడ్జిలు, హోటల్స్‌ను ఆకస్మిక తనిఖీలు చేపట్టామన్నారు.