News September 22, 2025
ప్రజా పిర్యాదులపై దృష్టి సాధించాలి: జిల్లా ఎస్పీ

ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై పోలీసు సిబ్బంది దృష్టి సాధించాలని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ ఆదేశించారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. గ్రీవెన్స్‌కు 110 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. ఫిర్యాదుదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఫిర్యాదులను సంబంధిత పోలీసు అధికారులకు పంపించారు.
Similar News
News September 22, 2025
అనంతపురం జిల్లాకు స్కోచ్ అవార్డు

అనంతపురం జిల్లాలో APMIP వివిధ పథకాల ద్వారా స్కోచ్ అవార్డును దక్కించుకుంది. కాగా అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లో APMIP అధికారులు కలెక్టర్ ఆనంద్‌కు ఈ అవార్డును అందజేశారు. ఈ విజయం సంతోషంగా ఉందని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణన్ శర్మ, APMIP PD రఘునాథ్‌రెడ్డి, ఉద్యాన శాఖాధికారి ఉమాదేవి పాల్గొన్నారు.
News September 22, 2025
540 అర్జీలను స్వీకరించిన కలెక్టర్ ఆనంద్

అనంతపురంలోని కలెక్టరేట్‌లో సోమవారం PGRS కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి కలెక్టర్ ఆనంద్ హాజరయ్యారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. తీసుకున్న 540 అర్జీలను సంబంధిత అధికారులతో విచారణ జరిపి త్వరగా పరిష్కరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.