News August 24, 2024

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక వాయిదా: ఎస్పీ

image

ఈనెల 26న జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు ఎస్పీ జీ.బిందు మాధవ్ ఓ ప్రకటనలో తెలిపారు. శ్రీ కృష్ణాష్టమి పండుగ సందర్భంగా వాయిదా వేసినట్లు వెల్లడించారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

Similar News

News December 15, 2025

కర్నూలు జిల్లా క్రీడాకారులను అభినందించిన నారా లోకేశ్

image

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈనెల 12 నుంచి 17వ తేదీ వరకు ఢిల్లీలో జరుగుతున్న 69వ నేషనల్ స్కూల్ గేమ్స్‌లో పాల్గొంటున్న జిల్లా స్విమ్మర్స్‌ను మంత్రి నారా లోకేశ్ అభినందించారు. డిల్లీ పర్యటనకు వచ్చిన లోకేశ్‌ను సోమవారం న్యూ ఎంపీ ఫ్లాట్‌లో క్రీడాకారులు హేమలత, శృతి, సిరి చేతన రాజ్, లహరిలు కలిశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలన్నారు.

News December 15, 2025

కర్నూలు: అంగన్వాడీల టీచర్లకు ఫోన్లు ఇచ్చిన కలెక్టర్

image

కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి అంగన్వాడీ సిబ్బందికి శాంసంగ్ 5-జీ సెల్‌ఫోన్లు పంపిణీ చేశారు. సోమవారం కలెక్టర్‌ చాంబర్‌లో జరిగిన కార్యక్రమంలో భాగంగా ఈ ఫోన్లను అందజేశారు. అంగన్వాడీలో సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు టీచర్లకు ఈ ఫోన్లు ఉపయోగపడతాయని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

News December 15, 2025

కర్నూలు: అంగన్వాడీలకు ఫోన్లు ఇచ్చిన కలెక్టర్

image

కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి అంగన్వాడీ సిబ్బందికి శాంసంగ్ 5-జీ సెల్‌ఫోన్లు పంపిణీ చేశారు. సోమవారం కలెక్టర్‌ చాంబర్‌లో జరిగిన కార్యక్రమంలో భాగంగా ఈ ఫోన్లను అందజేశారు. అంగన్వాడీ సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ ఫోన్లు ఉపయోగపడతాయని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.