News April 17, 2025
ప్రజా విధానాల రూపకల్పనలో గ్రాడ్యుయేట్లదే కీలకపాత్ర: రామ్మోహన్ నాయుడు

ప్రజా విధానాల రూపకల్పనలో గ్రాడ్యుయేట్ల కీలకపాత్ర అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. పటాన్ చెరు మండలం రుద్రారం సమీపంలోని గీతం యూనివర్సిటీలో విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రధాన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జీవితంలో ఎదిగేందుకు షార్ట్ కట్స్ ఉండవని, కష్టపడితే విజయం సాధిస్తారని చెప్పారు. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని సూచించారు.
Similar News
News April 19, 2025
నంద్యాల జిల్లాలో ఈదురు గాలుల బీభత్సం

నంద్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. దీంతో రైతులు విస్తారంగా సాగుచేసిన బొప్పాయి నేలకూలింది. ప్రధానంగా రుద్రవరం మండలంలోని ఆలమూరులో సుమారు 150 ఎకరాల్లో సాగుచేసిన బొప్పాయి పంట ఈదురుగాలుల కారణంగా నేలవాలింది. దీంతో కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు రైతులు వాపోతున్నారు. అకాల గాలి వర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.
News April 19, 2025
తిరుపతి: ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (DW&CW) తిరుపతి జిల్లా పరిధిలో కాంట్రాక్ట్ పద్ధతిలో 3 విభాగాలలో ఖాళీగా ఉన్న 5 ఉద్యోగాలకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. పారామెడికల్-1, మల్టీపర్పస్ స్టాప్/ కుక్ -3, సెక్యూరిటీ గార్డ్ -1 ఖాళీలు ఉన్నాయి. మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. అర్హత, ఇతర వివరాలకు https://tirupati.ap.gov.in/ వెబ్ సైట్ చూడగలరు. దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 30.
News April 19, 2025
నరసన్నపేట: వీడిన మిస్టరీ.. గుండెపోటుతో ఉద్యోగి మృతి

నరసన్నపేట మండల కేంద్రంలో స్థానిక మారుతీనగర్ ఒకటో వీధిలో అనుమానస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. వంశధార సబ్ డివిజన్‌లో అటెండర్‌గా పనిచేస్తున్న కొర్రాయి వెంకటరమణ గత మూడు రోజుల కిందట ఇంటి వద్ద ఉన్న సమయంలో గుండెపోటు రావడంతోనే మృతి చెందినట్లు ఎస్సై సీహెచ్ దుర్గాప్రసాద్ ధ్రువీకరించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించామని చెప్పారు. దీనిపై కేసు నమోదు చేశామని తెలిపారు.