News August 10, 2024

ప్రజా వినతులు స్వీకరించనున్న మంత్రి కొండపల్లి

image

రాష్ట్ర చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, సెర్ప్, ఎన్ఆర్ఐ వ్యవహారాలు శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆగష్టు 12న సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా వినతులు స్వీకరించనున్నారు. ఆరోజు ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు మంత్రి ప్రజల నుంచి వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తారని కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు.

Similar News

News September 16, 2025

సీఎం సమీక్షలో విజయనగరం జిల్లా నూతన రథసారథులు

image

రాష్ట్రంలో వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం చంద్రబాబు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ మంగళవారం నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో జిల్లా నూతన కలెక్టర్ ఎస్.రామ సుందరరెడ్డి, ఎస్పీ ఏఆర్ దామోదర్ పాల్గొన్నారు. జిల్లాలో చేపట్టాల్సిన వివిధ కార్యక్రమాలపై సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.

News September 16, 2025

పేద‌రిక నిర్మూల‌నే పీ-4 ల‌క్ష్యం: VZM జేసీ

image

పేద‌రిక నిర్మూల‌నే పీ-4 కార్య‌క్ర‌మం ప్ర‌ధాన‌ ల‌క్ష్య‌మ‌ని జేసీ ఎస్‌.సేతు మాధ‌వ‌న్‌ స్ప‌ష్టం చేశారు. మార్గ‌ద‌ర్శులు బంగారు కుటుంబాల‌ను ద‌త్త‌త తీసుకొని, వారిని పేద‌రికం నుంచి బ‌య‌ట‌కు తీసుకొచ్చే విధంగా కృషి చేయాల‌ని కోరారు. పీ-4 కార్య‌క్ర‌మం, బంగారు కుటుంబాలు, మార్గ‌ద‌ర్శుల పాత్ర‌పై స‌చివాల‌యం నుంచి ఎంపిక చేసిన ఎంవోటీ, టీవోటీలకు క‌లెక్ట‌రేట్లో మంగ‌ళ‌వారం శిక్ష‌ణా కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.

News September 16, 2025

VZM: ప్రత్యేక అలంకరణలో పైడిమాంబ

image

ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు విజయనగరం శ్రీపైడితల్లి అమ్మవారిని ఆలయ అర్చకులు సుందరంగా అలంకరించారు. మంగళవారం సందర్భంగా ప్రధాన ఆలయంతో పాటు చదురు గుడిలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు జరిపించి వివిధ రకాల పుష్పాలతో ముస్తాబు చేశారు. అనంతరం కుంకుమ పూజలు నిర్వహించి భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేశారు. సిరిమానోత్సవాల్లో భాగంగా ప్రత్యేక అలంకరణలో అమ్మవారు శోభిల్లుతున్నారు.