News March 22, 2026
ప్రజా సమస్యలకు చెక్.. సోమవారం మిస్ కావద్దు!

జిల్లా, డివిజన్, మండల కేంద్రాల్లో సోమవారం PGRS, రెవెన్యూ క్లినిక్ యథావిధిగా జరుగుతాయని కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. ప్రత్యేక అధికారులు, తహశీల్దార్లు హాజరై ప్రజల నుంచి PGRS అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలు తమ ఫిర్యాదులను సంబంధిత అధికారులకు అందజేసి పరిష్కరించుకోవాలని ఆమె కోరారు.
Similar News
News April 20, 2026
కాయకవే కైలాస.. బసవన్న మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శం!

బొమ్మూరు కలెక్టరేట్‌లో సోమవారం సంఘ సంస్కర్త బసవన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కీర్తి చేకూరి బసవన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. “కాయకవే కైలాస” అనే ఆయన బోధన ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. పని పట్ల నిబద్ధత, నిజాయితీతో కర్తవ్యాన్ని నిర్వహించడం ద్వారా సమాజానికి మేలు చేయవచ్చని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
News April 20, 2026
దళారుల ఉచ్చులో పడకండి: DTO

తూ.గో (D) రవాణాశాఖ సేవలు పూర్తిగా ఆన్‌లైన్‌లోనే అందుబాటులో ఉన్నట్లు DTO ఆర్. సురేశ్ సోమవారం తెలిపారు. లైసెన్స్ కోసం దళారులను ఆశ్రయించి మోసపోవద్దని వినియోగదారులకు సూచించారు. సమాచారం కోసం నేరుగా కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. ఎవరైనా లంచం అడిగితే తక్షణమే తమకు ఫిర్యాదు చేయాలని స్పష్టం చేశారు. పారదర్శక సేవలను వినియోగించుకోవాలని ఆయన కోరారు.