News February 23, 2026

ప్రజా సమస్యలకు పరిష్కారం చూపాలి: కలెక్టర్

image

ప్రజావాణిలో ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలని మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను క్రమ పద్ధతిలో స్వీకరించి వాటిని పరిష్కరించే విధంగా అధికారులు కృషి చేయాలని అధికారులకు సూచించారు. అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో అధికారులు పాల్గొన్నారు.

Similar News

News February 24, 2026

‘ఓం శాంతి శాంతి శాంతిః’ OTT డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

image

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించిన ‘ఓం శాంతి శాంతి శాంతిః’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. థియేటర్లలో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిన ఈ మూవీ మార్చి 4 నుంచి ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్ ఆహాలో అందుబాటులోకి రానుంది. ఆహా గోల్డ్ సబ్‌స్క్రైబర్స్ ఒకరోజు ముందే అంటే మార్చి 3 నుంచే ఈ చిత్రాన్ని చూడవచ్చు. భర్త పెట్టే హింసను భరిస్తూ చివరకు అతడికి తగిన గుణపాఠం చెప్పే భార్య కథే ఈ సినిమా స్టోరీ.

News February 24, 2026

కుప్పకూలిన ఎయిర్ అంబులెన్స్.. ఏడుగురు దుర్మరణం!

image

జార్ఖండ్‌లోని చత్రా జిల్లా సిమ్రియా సమీపంలో సోమవారం సాయంత్రం కుప్పకూలిన ఎయిర్ అంబులెన్స్ ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. రాంచీ నుంచి ఢిల్లీ వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న అందరూ ప్రాణాలు కోల్పోయారు. రెడ్‌బర్డ్ ఎయిర్‌వేస్‌కు చెందిన ఈ విమానం రాంచీ ఎయిర్‌పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ఘోరం జరిగిందని చత్రా జిల్లా కలెక్టర్ కీర్తిశ్రీ ధ్రువీకరించారు.

News February 24, 2026

ఆసిఫాబాద్ MLA కోవలక్ష్మిపై కేసు

image

ఆసిఫాబాద్ MLA కోవలక్ష్మిపై సోమవారం మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. క్యాతన్‌పల్లి మున్సిపల్ ఎన్నిక నేపథ్యంలో జరిగిన అల్లర్లు, మంత్రి కాన్వాయ్‌పై దాడి ఘటనలో ఇప్పటికే మాజీ MLA బాల్క సుమన్ అరెస్ట్ కాగా 13 మందిపై కేసు నమోదు చేశారు. ఆ గొడవలో ఓ మహిళా కానిస్టేబుల్‌ను MLA నెట్టేశారణే ఆరోపణలతో ఆమెపై కేసు నమోదు చేశారు. వీడియో ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.