News March 25, 2025
ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు : ఎస్పీ

పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. జిల్లా నలుమూలల ప్రజల నుంచి 13 సమస్యల వినతులు వచ్చాయి. వీటిలో ముఖ్యంగా భూవివాదాలు, కుటుంబ కలహాలు, ప్రేమ మోసాలు, వరకట్న వేధింపులు, ఆర్థిక సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయి. బాధితుల నుంచి వివరాలు సేకరించి ఆయా అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. తక్షణం ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు.
Similar News
News September 16, 2025
డిగ్రీ విద్యార్థులకు అలర్ట్..రేపటితో ముగియనున్న గడువు

ఎన్టీఆర్: కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో ఇటీవల నిర్వహించిన యూజీ(హానర్స్) 8వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. ఈ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు ఈ నెల 17వ తేదీలోగా ఒక్కో పేపరుకు రూ.800 ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుందని వర్శిటీ పరీక్షల విభాగం కంట్రోలర్ పి.వీరబ్రహ్మచారి సూచించారు.
News September 16, 2025
బంట్వారం: అంగన్‌వాడీ గుడ్డులో కోడిపిల్ల

పౌష్టికాహారం కోసం అంగన్‌వాడీ కేంద్రం ద్వారా పంపిణీ చేసిన గుడ్లలో ఓ బాలింతకు కోడిపిల్ల ఉన్న గుడ్డు లభించింది. దీంతో గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల పర్యవేక్షణ లోపించడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
News September 16, 2025
మహిళలకు ఆరోగ్య పరీక్షలు: కలెక్టర్

‘స్వస్త్ నారీ- స్వశక్తి పరివార్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఆమె మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. మహిళలకు రక్తహీనత, బీపీ, థైరాయిడ్, టీబీ పరీక్షలు నిర్వహించి, గర్భిణుకు ఆరోగ్య పరీక్షలు చేసి నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించడమే ముఖ్య లక్ష్యమని వివరించారు.