News March 10, 2025
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 309 అర్జీలు

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పలు సమస్యలపై ప్రజలు అందిస్తున్న అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో కలెక్టర్ ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 309 అర్జీలు వచ్చినట్లు కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తెలిపారు. అయన వెంట జాయింట్ కలెక్టర్ కార్తీక్, తదితరులు ఉన్నారు.
Similar News
News May 8, 2025
హై కోర్టులో కాకాణి బెయిల్ పిటిషన్.. తీర్పు వాయిదా

మాజీ మంత్రి కాకాణికి హైకోర్టులో ఊరట దక్కలేదు. పొదలకూరు(మ) వరదాపురంలో అక్రమ మైనింగ్‌కు సంబంధించి ఆయనపై కేసు నమోదైంది. గిరిజనులను బెదిరించారనే ఆరోపణలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును పోలీసులు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం కాకాణి వేసిన పిటీషన్‌పై గురువారం హైకోర్టులో వాదనలు జరిగాయి. కోర్టు.. తీర్పును జూన్ 16కు వాయిదా వేసింది. కాకాణి పరారీలో ఉన్న విషయం తెలిసిందే.
News May 8, 2025
నుడా వీసీగా జేసీ కార్తీక్

నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్(నుడా) వైస్ ఛైర్మన్‌గా జాయింట్ కలెక్టర్ కార్తీక్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో నుడా వీసీగా నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ సూర్యతేజ పనిచేశారు. ఆయన ఇటీవలే బదిలీ అయ్యారు. గత కొద్ది రోజులుగా ఆ పోస్టు ఖాళీగా ఉంది. దీంతో జేసీని నుడా వైస్ ఛైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది.
News May 7, 2025
మత్స్యకార సేవలో పథకం ద్వారా జిల్లాకి రూ.24.47 కోట్లు

జిల్లాలో మత్స్యకార సేవలో పథకం ద్వారా 12,239 మంది మత్స్యకారులకు రూ.24.47 కోట్లు నగదును వారి బ్యాంకు ఖాతాలకు ముఖ్యమంత్రి జమచేసినట్లు జిల్లా మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ నాగేశ్వరరావు తెలిపారు. శనివారం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం బీచ్ నుంచి సీఎం చంద్రబాబు ‘మత్స్యకార సేవలో’ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.