News March 23, 2025

ప్రజా సమస్యల పరిష్కార వేదిక వేళలు ఇవే: కలెక్టర్

image

నంద్యాల కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు కలెక్టర్‌ రాజకుమారి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎండలను దృష్టిలో ఉంచుకొని కార్యక్రమానికి వచ్చే ప్రజలెవ్వరూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఉదయం 9.30 గంటలకే అర్జీల స్వీకరణ చేపడతామన్నారు. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహిస్తామన్నారు.

Similar News

News January 6, 2026

కామారెడ్డి: MRO కార్యాలయంపై ఏసీబీ దాడులు

image

నాగిరెడ్డిపేట MRO కార్యాలయంపై మంగళవారం ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేశారు. ఓ గ్రామానికి చెందిన రైతు తన పట్టా భూమిని తన పేరున మార్చాలని పలుమార్లు రెవెన్యూ అధికారులను కోరగా, వారు పెద్ద మొత్తంలో లంచం డిమాండ్‌ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ డీఎస్పీ శేఖర్‌ గౌడ్‌ నేతృత్వంలో అధికారులు దాడులు నిర్వహించి రెవెన్యూ అధికారులను అధీనంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు.

News January 6, 2026

బంగ్లాదేశ్ హిందూ క్రికెటర్‌ను కెప్టెన్ చేసింది: జేడీయూ నేత

image

బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్‌ను KKR జట్టు నుంచి <<18748860>>తొలగించడాన్ని<<>> JDU నేత KC త్యాగి తప్పుబట్టారు. ‘క్రీడలను రాజకీయాలు ప్రభావితం చేయకూడదు. బంగ్లాలో జరుగుతున్న వాటిపై మనం ఆందోళన చేస్తున్నాం. IPL నుంచి ఆ దేశ క్రికెటర్‌ను తొలగించాం. కానీ బంగ్లా జాతీయ జట్టుకు మైనారిటీ క్రికెటర్, హిందువు(లిటన్ దాస్‌)ను కెప్టెన్‌గా చేసింది. వాళ్లు బలమైన సందేశం పంపారు. మనం పునరాలోచించాలి’ అని చెప్పారు.

News January 6, 2026

ఈ చీర ధర 39 లక్షలు.. ప్రత్యేకతలివే..

image

చెన్నైకి చెందిన ప్రముఖ టెక్స్‌టైల్ సంస్థ 36 లక్షల రూపాయల ఖరీదైన చీరను తయారు చేసింది. దీన్ని డబుల్‌ వార్ఫ్‌ పద్ధతిని ఉపయోగించి చేతితో నేశారు. 64 రంగుల షేడ్స్‌, పది ప్రత్యేకమైన డిజైన్లు ఉండే ఈ చీర బరువు 8కేజీలు. 59.7 గ్రాముల బంగారం, 3.9 క్యారెట్ల వజ్రం, 5 క్యారెట్ల నీలమణిని వినియోగించారు. అంత విలువైన వజ్రాలు, కళాఖండాలకు నిలయం కావడంతోనే ఈ చీర గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులో చోటు దక్కించుకుంది.