News August 25, 2025

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 248 అర్జీలు: కలెక్టర్

image

భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. ప్రజల నుంచి 248 అర్జీలు స్వీకరించి పరిశీలించారు. అర్జీదారుడికి సంతృప్తి కలిగేలా సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తమ పరిధిలో లేని అర్జీలను సైతం సంబంధిత శాఖలకు పంపించాలని సిబ్బందికి సూచించారు. ప్రజలు ప్రజా సమస్యల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News August 26, 2025

‘తల్లికి వందనం పెండింగ్ క్లైమ్‌ల పరిష్కారానికి చర్యలు’

image

జిల్లాలో తల్లికి వందనం పెండింగ్ క్లైమ్‌ల పరిష్కారానికి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో పలు అంశాలపై మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. తల్లికి వందనం ఖాతాలో నగదు జమ చేయడానికి ఇబ్బందిగా ఉన్న అంశాల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలన్నారు.

News August 25, 2025

కేపీపాలెం‌ బీచ్‌లో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

image

మొగల్తూరు మండలం కేపీపాలెం బీచ్‌లో ఆదివారం సముద్ర స్నానం చేస్తూ ఓ యువకుడు గల్లంతైన విషయం తెలిసిందే. స్థానికుల వివరాల మేరకు.. మొగల్తూరు మండలం కొత్తపాలెంకు చెందిన శ్రీహర్ష(17) తన కుటుంబ సభ్యులతో కలిసి సముద్రంలో స్నానం చేస్తున్నాడు. ఈక్రమంలో అలల ఉద్ధృతికి లోపలికి కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. సోమవారం శ్రీహర్ష మృతదేహం లభ్యమైంది. మృతదేహన్ని నరసాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు,

News August 25, 2025

స్మార్ట్ కార్డులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

image

జిల్లా వ్యాప్తంగా 1. 51 లక్షల స్మార్ట్ కార్డులు వచ్చాయని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. సోమవారం పాలకొల్లు తహశీల్దార్ కార్యాలయం వద్ద స్మార్ట్ కార్డుల పంపిణీ చేశారు. క్యూ ఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ కార్డుల ద్వారా రేషన్ పంపిణీలో జరిగే అక్రమాలను సులభంగా అరికట్టవచ్చన్నారు. స్మార్ట్ కార్డులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.