News February 3, 2025

ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు: అనకాపల్లి ఎస్పీ

image

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఎన్నికల కోడ్ ఈనెల 29 నుంచి మార్చి 8 వరకు అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు అనకాపల్లి ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల ముగిసిన వెంటనే ఈ కార్యక్రమాన్ని తిరిగి కొనసాగిస్తామన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి పోలీస్ కార్యాలయానికి రావద్దని కోరారు.

Similar News

News November 8, 2025

GNT: సరిగ్గా 9 ఏళ్ల క్రితం అందరి మైండ్ బ్లాక్..!

image

2016 నవంబర్ 8న ప్రభుత్వం రూ.500, 1000 నోట్లను రద్దు చేయటం ఉమ్మడి గుంటూరు జిల్లాలను కుదిపేసింది. నూతన రాజధాని పరిసర ప్రాంతాల్లో ప్రారంభమైన ప్రాజెక్టులు, రియల్ ఎస్టేట్, రాజధాని రాక కారణంగా ప్రజల్లో పెరిగిన లావాదేవీలపై నోట్ల రద్దు పెను ప్రభావాన్ని చూపించింది. ఆ సమయంలో ఇతర జిల్లాల్లో లక్షల్లో లావాదేవీలు జరిగితే ఇక్కడ కోట్లల్లో జరిగాయి. ఆ పరిణామం జిల్లా ప్రజలు ఎప్పటికీ మరువలేని. దీనిపై మీ COMMENT.

News November 8, 2025

‘అలిపిరి’ అంటే అర్థం మీకు తెలుసా?

image

తిరుపతి నుంచి తిరుమల శ్రీవారి ఆలయానికి కాలినడకన వెళ్లడానికి తొలి ప్రవేశ మార్గం ‘అలిపిరి’. సోపానమార్గంలో కనిపించే తొలి ప్రదేశం ఇదే. ఈ అలిపిరిని కొందరు ‘అడిప్పడి’ అని అంటారు. అడి అంటే అడుగున ఉన్న భాగం. పడి అంటే మెట్టు. తిరుమల కొండకు అడుగున ఉన్న పడికట్టు ప్రదేశమే ఇది. కొందరు దీన్ని అడిప్పుళి అని కూడా అంటారు. పుళి అంటే చింత చెట్టు. అడుగు భాగాన కనిపించే చింతచెట్టు ప్రదేశమని దీని భావం. <<-se>>#VINAROBHAGYAMU<<>>

News November 8, 2025

గూగుల్ మ్యాప్స్‌లో ఆర్టీసీ టికెట్ బుకింగ్

image

టికెట్ బుకింగ్ కోసం APSRTC మరో కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఎక్కడి నుంచి ఎక్కడికెళ్లాలో గూగుల్ మ్యాప్స్‌లో సెర్చ్ చేస్తే ఆ రూట్‌లో తిరిగే ఆర్టీసీ రిజర్వేషన్ సదుపాయం ఉన్న బస్సులు, జర్నీ టైమ్‌ వివరాలు కనిపిస్తాయి. వాటి మీద క్లిక్ చేస్తే RTC వెబ్‌సైట్‌లోకి తీసుకెళ్తుంది. ఈ మేరకు గూగుల్ ప్రతినిధులతో చర్చలు పూర్తయ్యాయి. VJA-HYD మార్గంలో అమలుచేయగా విజయవంతమైంది. త్వరలో అన్ని రూట్లలో మొదలుకానుంది.