News July 10, 2025
ప్రణాళిక నివేదికను 15 రోజుల్లో సమర్పించాలి: WGL కలెక్టర్

వరంగల్ సూపర్ స్పెషాలిటీ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి ఆయా క్లినికల్ విభాగాల్లో వసతుల కేటాయింపు ప్రణాళిక నివేదికను 15 రోజుల్లో సమర్పించాలని జిల్లా వైద్యాధికారులకు కలెక్టర్ సత్య శారద దేవి ఆదేశాలు జారీ చేశారు. నిర్మాణ సంస్థ ప్రతినిధులు, ఆర్అండ్‌బీ అధికారులు, వైద్యాధికారులతో కలిసి బుధవారం ఆసుపత్రిని సందర్శించారు. క్షేత్ర స్థాయిలో నిర్మాణంలో ఉన్న గదులు వాటిలో ఏర్పాటు చేయాల్సిన వసతులను అడిగారు.
Similar News
News July 10, 2025
విశాఖలో CII పార్టనర్షిప్ సమ్మిట్

AP: నవంబరు 14,15 తేదీల్లో విశాఖలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్(CII) 30వ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ జరగనుంది. సదస్సు సన్నాహక ఏర్పాట్లపై సచివాలయంలో CS విజయానంద్ ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. రిజిస్ట్రేషన్, ఇతర ఏర్పాట్లకు సంబంధించిన అంశాలను ఆన్‌లైన్ చేయాలన్నారు. సదస్సును సక్సెస్ చేసేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు మొదలు పెట్టాలని పరిశ్రమల శాఖ అధికారులు, విశాఖ కలెక్టర్‌ను ఆదేశించారు.
News July 10, 2025
‘విద్యార్థులారా.. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి’

అనంతపురం JNTUలో స్వీడన్ బ్యాచ్ కోర్స్‌ను ప్రారంభించినట్లు వీసీ సుదర్శన రావు, రిజిస్ట్రార్ కృష్ణయ్య, డైరెక్టర్ సుజాత తెలిపారు. 4 ఏళ్ల బీటెక్ CSE/ECE కోర్సులో మొదట మూడేళ్లు JNTUలో, 4వ ఏడాది స్వీడన్‌లో చదవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఈనెల 17వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు JNTUలోని డైరెక్టర్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
News July 10, 2025
MDK: ఇద్దరు మహిళలు అదృశ్యం.. కేసు నమోదు

కుటుంబ కలహాలతో ఇంటి నుంచి వెళ్లిన ఇద్దరు మహిళలు అదృశ్యమైన ఘటన రామాయంపేటలో చోటుచేసుకుంది. ఎస్ఐ బాలరాజు తెలిపిన వివరాలు.. స్థానిక రెడ్డి కాలనీలో నివాసం ఉండే అక్కల అరుణ (27), ఆమె తోటి కోడలు అక్కల మౌనిక (26) మంగళవారం అర్ధరాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఎక్కడ వెతికినా ఆచూకీ లభించకపోవడంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.