News August 8, 2024
ప్రతిఒక్కరూ చేనేత వస్త్రాలను విరివిగా ధరించాలి: కలెక్టర్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలను చేనేత కార్మికులకు అందించేందుకు కృషి చేస్తున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం నెల్లూరులోని గాంధీబొమ్మ సెంటర్ వద్ద మహత్మ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రతిఒక్కరూ చేనేత వస్త్రాలను విరివిగా ధరించి, చేనేత కార్మికులకు అండగా నిలవాలన్నారు.
Similar News
News September 16, 2025
నెల్లూరు: ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేక రైతుల ఇబ్బందులు!

జిల్లాలో 5 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. కోతలు మొదలైపోయినా ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మద్దతు ధర పుట్టి రూ.20,187 ఉండగా మిల్లర్లు రూ.13–15 వేలకే కొనుగోలు చేస్తున్నారు. వర్షాలు పంటను దెబ్బతీయగా ధరలు పడిపోతాయనే ఆందోళన రైతుల్లో ఉంది. గతంలో పుట్టి రూ.24 వేలు ఉండగా, ఇప్పుడు దళారుల చేతిలో దోపిడీకి గురవుతున్నామని రైతులు వాపోతున్నారు.
News September 16, 2025
నెల్లూరు: సాగు నీరు ముందుకెళ్లేది ఎలా?

అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారుతోంది. ప్రధాన ఆయకట్టు పంట కాలువల్లో గుర్రపు డెక్క పెద్ద ఎత్తున పెరిగిపోవడంతో సాగు నీటికి ఆటంకంగా మారుతోంది. దీంతో సీజన్లో ఆయకట్టు పొలాలకు నీరు అందడం లేదు. జాఫర్ సాహెబ్ కాలువ, సర్వేపల్లి కెనాల్, కనుపూరు కెనాల్ పంట కాలువల్లో రబీ ఆరంభానికి ముందే పూడికతీత పనులు చేపట్టాల్సిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు.
News September 16, 2025
ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానన్నడం హాస్యాస్పదం : మంత్రి ఆనం

ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా అనడం హాస్యాస్పదమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. 11 మంది వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రాకుండా ఏం చేయదలచుకున్నారనీ ఆత్మకూరులో మంగళవారం ఆయన ప్రశ్నించారు. 11 నియోజకవర్గాల్లో ప్రజల సమస్యలు మీకు పట్టవా? సమస్యలను ప్రభుత్వం దృష్టికి తేవాలన్న ఆలోచన లేదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపర్ సిక్స్ పథకాలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా అమలు చేస్తున్నామని వివరించారు.