News December 16, 2024
ప్రతిపక్షంగా ప్రశ్నిస్తూనే ఉంటాం: సిరికొండ
ప్రతిపక్ష పార్టీగా నిత్యం ప్రశ్నిస్తూనే ఉంటామని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. శాసనమండలిలో నేడు ఆయన మాట్లాడుతూ.. కుల సంఘ భవనాల నిర్మాణాలకు స్థలాన్ని కేటాయించి వారిని గౌరవించిన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పుకొచ్చారు. శాసనమండలికి ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
Similar News
News February 5, 2025
MHBD: వైద్యం వికటించి యువకుడు మృతి
తొర్రూరు మండలంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. బాధితులు, స్థానికుల వివరాలు.. వైద్యం వికటించి సిద్ధూ(16) మృతి చెందాడు. జలుబు వస్తుందని ఆసుపత్రికి వెళ్తే ఇంజెక్షన్ వేశారని, ఆ వెంటనే సిద్దు మృతి చెందాడని బంధువులు ఆరోపించారు. దీంతో కుటుంబ సభ్యులు డెడ్ బాడీతో ఆస్పత్రిలోనే ఆందోళన చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 5, 2025
పార్కులలోని పనులు వెంటనే పూర్తి చేయాలి: కమిషనర్
పార్కుల్లో పెండింగ్‌లో ఉన్న పనులు వెంటనే పూర్తి చేయాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో హార్టికల్చర్ ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నగరవ్యాప్తంగా ఉన్న వివిధ పార్కులలో దెబ్బతిన్న జిమ్ పరికరాలు, పిల్లలు ఆడుకునే ఆట వస్తువులను, మరమ్మతులు, దెబ్బతిన లైటింగ్ పునరుద్దించాలని అధికారులను ఆదేశించారు.
News February 5, 2025
WGL: విషాదం.. గుండెపోటుతో యువకుడు మృతి
వరంగల్ జిల్లాలో గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈరోజు ఉదయం ఓ యువకుడు హార్ట్ ఎటాక్‌తో మరణించాడు. నగరంలోని డాక్టర్స్ కాలనీకి చెందిన కుమారస్వామి(33) ఈరోజు ఉదయం అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య, 3 నెలల పాప ఉంది. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.