News October 4, 2024
ప్రతిపక్షాల కుట్రలు తిప్పి కొట్టాలి: పొన్నం ప్రభాకర్

ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టాలని రాష్ట్ర రవాణా శాఖామంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. బిక్కనూరు మండల కేంద్రంలో ఆయన మాట్లాడారు. అన్ని వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని గుర్తు చేశారు. రైతులను ప్రతిపక్ష పార్టీలు తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో పార్టీ శ్రేణులు వారి మాటలను తిప్పి కొట్టాలన్నారు.
Similar News
News November 7, 2025
NZB: న్యూసెన్స్ చేస్తున్న ముగ్గురు మహిళలకు జైలు శిక్ష: SHO

న్యూసెన్స్ చేస్తున్న ముగ్గురు మహిళలకు జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్ స్పెషల్ సెకండ్ క్లాస్ జడ్జి గురువారం తీర్పు చెప్పారని వన్ టౌన్ SHO రఘుపతి తెలిపారు. నగరంలోని బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతంలో బుధవారం రాత్రి ముగ్గురు మహిళలు అసభ్యంగా ప్రవర్తిస్తూ పబ్లిక్‌లో న్యూసెన్స్ చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేసి గురువారం కోర్టులో హాజరు పరచగా 2 రోజుల చొప్పున జైలు శిక్ష విధించినట్లు చెప్పారు.
News November 7, 2025
NZB: ఈ నెల 8 నుంచి రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలు

తెలంగాణ అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 8 నుంచి 9 వరకు సీనియర్ పురుషులు, మహిళల రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలను HYD సుల్తాన్ సాయి ప్లే గ్రౌండ్లో ఓపెన్ క్యాటగిరిలో నిర్వహిస్తామని NZB రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు భక్తవత్సలం తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు తమ ఒరిజినల్ ఆధార్ కార్డ్, బర్త్ సర్టిఫికెట్తో హాజరుకావాలన్నారు. మరింత సమాచారం కోసం ఫోన్ నంబర్ 9550358444కు సంప్రదించాలన్నారు.
News November 7, 2025
నిజామాబాద్ జిల్లాలో సెక్షన్ 163 అమలు

టీజీపీఎస్సీ నిర్వహిస్తున్న డిపార్ట్మెంట్ పరీక్షల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా పరిధిలోని పరీక్షా కేంద్రాల వద్ద ఈ నెల 8 నుంచి 14 వరకు ఉదయం 8గం.ల నుంచి సాయంత్రం 6 గం.ల వరకు బీఎన్ఎస్ సెక్షన్ 163 అమలు చేయనున్నట్లు సీపీ సాయిచైతన్య తెలిపారు. ఇద్దరూ లేదా అంతకంటే ఎక్కువ మంది పరీక్షా కేంద్రాల వద్ద గుమిగూడరాదని, నిషేధిత వస్తువులతో పరీక్షా కేంద్రం వద్ద తిరగవద్దని సీపీ సూచించారు.


