News August 6, 2025
ప్రతిభ కనబరిస్తే తప్పక ప్రోత్సాహం: ఖమ్మం CP

ఉత్సాహంతో పనిచేసే పోలీస్ సిబ్బందిని మరింత ప్రోత్సహిస్తామని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. ఇటీవల జిల్లాలో గంజాయి వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాల నియంత్రణలో కష్టపడి పనిచేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఎస్కే. ఖాసీం అలీ, వి.గోపి, ఎం.సతీష్‌ను సీపీ అభినందించి, క్యాష్ రివార్డు అందజేశారు. పోలీసులు విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన వారికి ప్రభుత్వం తప్పక ప్రోత్సాహం అందిస్తుందని ఈ సందర్భంగా చెప్పారు.
Similar News
News August 6, 2025
క్రూడ్ పామాయిల్ పై దిగుమతి సుంకాన్ని 44%కు పెంచాలి: తుమ్మల

క్రూడ్ పామాయిల్ పై దిగుమతి సుంకాన్ని 44 శాతానికి పెంచాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌ను కోరారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, నిర్మల సీతారామన్‌ను కలిసి పలు సమస్యలను వివరించారు. ఏప్రిల్ నుంచి జులై వరకు ఏర్పడిన లోటు యూరియాను ఈ నెల ఆగస్టు కేటాయింపులతో కలిపి వెంటనే సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు.
News August 6, 2025
ATC కోర్సులతో ఉపాధి భరోసా: కలెక్టర్

యువతకు ATC కోర్సులతో ఉద్యోగాలకు భరోసా లభిస్తుందని, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. బుధవారం ఖమ్మం టేకులపల్లిలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థను అప్ గ్రేడ్ చేసిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్‌ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మారుతున్న కాలంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు నిష్ణాతులైన ట్రైనర్ల పర్యవేక్షణలో శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు.
News August 6, 2025
‘ఇందిరమ్మ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు’

జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. అయితే లబ్దిదారులకు నిర్మాణ సామాగ్రి వ్యయం భారం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం మండల నిర్మిత కేంద్రాలను తిరిగి ప్రారంభించింది. వీటి ద్వారా ఫ్లైయాష్ బ్రిక్స్‌ను సరసమైన ధరకే అందించనుంది. తద్వారా లబ్దిదారులకు ఆర్థిక భారం కాకుండా తోడ్పాటు నందించనుంది. కాగా ఇప్పటికే చింతకానిలో విఘ్నేశ్వర ఫ్లైయాష్ బ్రిక్ యూనిట్ కేంద్రం ప్రారంభమైంది.