News February 2, 2026

‘ప్రతి ఇంటి నుంచి తప్పనిసరిగా చెత్త సేకరణ జరగాలి’

image

జిల్లాలోని పంచాయతీల్లో ప్రతి ఇంటి నుంచి తప్పనిసరిగా చెత్తను సేకరించాలని కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్ ఆదేశించారు. గ్రామాల్లో పరిశుభ్రత లోపిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఆయన మండలాల వారీగా సమీక్షించారు. కనీసం 75 శాతం చెత్త సేకరణ చేసి త్వరలో 100 శాతం లక్ష్యం సాధించాలని సూచించారు. జలజీవన్ మిషన్ పనులు పూర్తి చేసి తాగునీటి సరఫరా అమలు చేయాలని అన్నారు.

Similar News

News February 13, 2026

BREAKING: సంగారెడ్డి: కోహిర్‌లో హంగ్

image

సంగారెడ్డి జిల్లా కోహిర్ మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. ఇక్కడ మొత్తం 16 వార్డులు ఉండగా కాంగ్రెస్ 8, BRS 5,బీజేపీ 1, స్వతంత్రులు 2 గెలిచారు. కాగా మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ గెలవడంతో కోహిర్ మున్సిపల్ పీఠం ఆ పార్టీకి దక్కే ఛాన్స్ ఉంది.

News February 13, 2026

మండలి నుంచి YCP వాకౌట్

image

AP: శాసన మండలి నుంచి YCP సభ్యులు వాకౌట్ చేశారు. విద్యా వ్యవస్థలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ మండలిలో చెప్పారు. అధికార పక్షం ఆరోపిస్తున్నట్లుగా వాకౌట్ చేయడం తమకు ఫ్యాషన్ కాదని, తమ నిరసన ద్వారా పాలనలోని లోపాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడం, తద్వారా ప్రభుత్వాన్ని అలర్ట్ చేయడమేనని వివరించారు.

News February 13, 2026

BREAKING: పాలమూరు: దేవరకద్రలో హంగ్

image

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. ఇక్కడ మొత్తం 12 వార్డులు ఉండగా కాంగ్రెస్ 6, BRS 4, బీజేపీ 1, స్వతంత్రులు 1 గెలిచారు. కాగా మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ గెలవడంతో దేవరకద్ర మున్సిపల్ పీఠం ఆ పార్టీకి దక్కే ఛాన్స్ ఉంది.