News April 5, 2025
ప్రతి ఇంట్లో వ్యాపారవేత్త ఉండాలి : నెల్లూరు మంత్రి

2047 నాటికి ప్రతి ఇంట్లో ఒక వ్యాపారవేత్త ఉండాలని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. విజయవాడలో జరిగిన మెప్మా వన్ డే వర్క్ షాప్‌లో ఆయన పాల్గొన్నారు. మహిళాకాశం పేరిట మెప్మా వెబ్ సైట్, మెప్మా మొబైల్ యాప్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ ఆర్థిక సంవత్సరం 30 వేల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారుచేయడమే మెప్మా లక్ష్యమని తెలిపారు. ఈ వర్క్ షాపులో నారాయణతో పాటు మెప్మా డైరెక్టర్ తేజ్ భరత్ పాల్గొన్నారు.
Similar News
News April 5, 2025
కాకాణి కేసు.. నిన్న హైకోర్టులో జరిగిన వాదనలు ఇవే..!

కాకాణి బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగి 7కి వాయిదా పడిన విషయం తెలిసిందే. నేరాలు చేసినట్లు పిటిషనర్‌పై ఆరోపణలు లేవని, సాక్షుల వాంగ్మూలంతోనే కేసులు నమోదు చేశారని కాకాణి లాయర్ వాదించారు. ఎస్సీ, ఎస్టీలను అవమానించి, ఆస్తులను నాశనం చేసినట్లు చెప్పలేదన్నారు. కాకాణిపై ఎస్సీ, ఎస్టీ చట్టంలోని సెక్షన్లు చెల్లుబాటు కావని, దీనిపై ముందస్తు బెయిల్ మంజూరు చేసే అధికారం హైకోర్టుకు ఉంటుందని వినిపించారు.
News April 5, 2025
నెల్లూరులో ముగిసిన ఇంటర్ మూల్యాంకనం

నెల్లూరు జిల్లాలో ఇంటర్ ప్రశ్నాపత్రాల మూల్యాంకనం(కరెక్షన్) శుక్రవారంతో ముగిసిందని ఆర్ఐవో డాక్టర్ శ్రీనివాసులు ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం 1200 మంది లెక్చరర్లు, 150 మంది సిబ్బంది ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టామన్నారు. 3.54 లక్షల పేపర్లు దిద్దామని చెప్పారు. ఈ వివరాలను స్కానింగ్ చేసి ఇంటర్ బోర్డుకు పంపామన్నారు.
News April 5, 2025
నెల్లూరు: 10 చలివేంద్రాలు ప్రారంభం

నెల్లూరు కలెక్టర్ ఆనంద్ ఆదేశాల మేరకు జిల్లాలోని 10 మండలాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎరువులు, పురుగుమందులు డీలర్లు అసోసియేషన్ సహకారంతో చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. నెల్లూరు గాంధీ బొమ్మ కూడలి, మనుబోలు, దగదర్తి, కావలి, అల్లూరు, వింజమూరు, టీపీ గూడూరు, పొదలకూరు, కందుకూరు, ఆత్మకూరు మండల కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేశామని జిల్లా వ్యవసాయ అధికారి పుట్టా సత్యవాణి తెలిపారు.