News September 7, 2025

ప్రతి ఒక్కరికీ అభినందనలు: ఆదిలాబాద్ ఎస్పీ

image

ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతి, భక్తి వాతావరణంలో 600 మంది పోలీసులతోపాటు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థుల సహకారంతో నిమజ్జన ఉత్సవాలు విజయవంతంగా పూర్తి చేశామని ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదివారం పేర్కొన్నారు. మరోవైపు ఇందుకు పలు సంఘాలు, కమిటీలు, మండప నిర్వాహకులు, యువత సహకారం అభినందనీయమని ఆయన తెలిపారు.

Similar News

News October 27, 2025

ADB: పుస్తక పఠనంతో ఆలోచనా శక్తి పెరుగుతుంది: కలెక్టర్

image

పుస్తకాలను చదవడం ద్వారా ఆలోచనాశక్తి, జ్ఞానం పెరుగుతాయని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆదివారం స్థానిక గాంధీ పార్క్‌లో ‘పుస్తక పఠనం చేద్దాం’ కార్యక్రమాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. గ్రంథాలయాల్లో అందుబాటులో ఉన్న విలువైన పుస్తకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ కోరారు.

News October 26, 2025

కైలాష్ సుందరకాండ పుస్తకాన్ని ఆవిష్కరించిన గవర్నర్

image

వనవాసి కల్యాణ పరిషత్ ఆధ్వర్యంలో అచ్చంపేటలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొని, తొడసం కైలాస్ మాస్టర్ రచించిన “సోభత ఖడి” సుందరకాండ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీ మాధవి దేవి, హర్యానా మాజీ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ, వనవాసి కల్యాణ పరిషత్ అధికారి శ్రీ రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

News October 26, 2025

ADB: కాంగ్రెస్‌లో కొత్త ట్రెండ్

image

కాంగ్రెస్ 42% బీసీ రిజర్వేషన్ ప్రకటించిన నేపథ్యంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుల(డీసీసీ) పదవుల్లో సైతం బడుగులకు ప్రాధాన్యతనివ్వనుంది. నిన్న ఢిల్లీలో జరిగిన పార్టీ ముఖ్యనేతల సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50% అధ్యక్ష పదవులు ఇవ్వాలని, గతంలో ఎలాంటి పదవులు చేపట్టని వారికి పదవులు ఇవ్వాలని నిర్ణయించడంతో జిల్లాలో డీసీసీ పదవి కోసం ఆశిస్తున్న వారిలో ఉత్కంఠ నెలకొంది.