News September 1, 2024
ప్రతి ఒక్కరిని ఆదుకుంటాం: మంత్రి సత్యకుమార్
రాష్ట్రంలో వరదల వల్ల నష్టపోయిన ప్రతి కుటుంబానికి సాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ధర్మవరం ఎమ్మెల్యే, మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ప్రతి వరద బాధితుడికి 25 కేజీల బియ్యం, కేజీ చక్కర, కేజీ నూనె, ఉల్లి, బంగాళదుంపలు అందించాలని అధికారులకు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
Similar News
News January 20, 2025
అనంతపురం: ఏకసభ్య కమిషన్‌ను కలిసిన కలెక్టర్‌లు
ఎస్సీల ఉప వర్గీకరణ ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రాను రెండు జిల్లాల కలెక్టర్లు కలిశారు. సోమవారం అనంతపురం పట్టణంలోని R&B అతిథి గృహంలో శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్, అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ జగదీష్, అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న తదితరులు కలిసి పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం పలు విషయాలపై చర్చించారు.
News January 20, 2025
మైనస్ 8 డిగ్రీల చలిలో తాడిపత్రి చిన్నారుల నృత్యం
తాడిపత్రికి చెందిన చిన్నారులు జమ్మూ కశ్మీర్‌లోని వైష్ణోదేవి టెంపుల్, హిడింబ వద్ద మైనస్ 8 డిగ్రీల చలిలో కూచిపూడి నృత్యం చేసి అందరిని అబ్బురపరిచారు. దాదాపు 22 కిలోమీటర్లు కాలినడకన చేరుకుని నృత్య ప్రదర్శన చేసినట్లు శిక్షకులు వందన, ప్రవీణ్ లు తెలిపారు. ఈ చిన్నారులు ఇప్పటికే వరల్డ్ రికార్డ్ బుక్‌లో చోటు సంపాదించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేత అభినందనలు అందుకున్నారు.
News January 20, 2025
ప్రేమ పేరుతో వేధింపులు.. యువకుడిపై పోక్సో కేసు
అనంతపురం జిల్లా ఉరవకొండలో ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. సీఐ మహానంది వివరాల మేరకు.. పట్టణానికి చెందిన చిరంజీవి అనే యువకుడు ప్రేమ పేరుతో ఓ బాలికను వేధిస్తున్నాడు. హెచ్చరించినా అతడి తీరు మారలేదు. తరచూ వేధింపులకు గురిచేస్తుండటంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.