News January 5, 2025
ప్రతి ఒక్కరిలో భగవంతుడున్నాడు: గవర్నర్
ప్రతి ఒక్కరిలో భగవంతుడున్నాడని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. పీయూఎన్ వర్మ, అమరవాణి ఫౌండర్ డాక్టర్ మదన్ మహరాజ్ గోసావి ఆధ్వర్యంలో రాజభవన్ సంస్కృతి కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన భాగ్యనగర్ భారతీయ సంస్కృతి సమ్మేళన్ కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సనతాన ధర్మం అంటే ఎప్పటికప్పుడు తమలోని విజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ కాలంతో పాటు ధర్మాన్ని ఆచరించడమేనని అన్నారు.
Similar News
News January 7, 2025
HYD: బాలికపై అత్యాచారం.. నిందితుడికి 20 ఏళ్ల జైలు
HYDలోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి 20ఏళ్ల జైలు శిక్ష, రూ.15వేల జరిమానా విధిస్తూ రంగారెడ్డి కోర్టు తీర్పు ఇచ్చింది. 2018లో వనస్థలిపురం PS పరిధిలో తాపీ మేస్త్రిగా పనిచేసే కార్తిక్(22) ఓ బాలికను ప్రేమపేరుతో మభ్యపెట్టి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో నిందితుడిపై పోక్సో కేసు నమోదైంది.
News January 7, 2025
HYD: భారీగా పట్టుబడ్డ నకిలీ పన్నీరు
హైదరాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిసరి ఎంక్లేవ్‌లో నకిలీ పన్నీరు భారీ మొత్తంలో పట్టుబడింది. విశ్వసనీయ సమాచారంతో నకిలీ పన్నీరు తయారు కేంద్రంపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేపట్టారు. నిందితులను పట్టుకొని అల్వాల్ పోలీసులకు అప్పగించారు. అక్కడ సుమారు 600 కిలోల పన్నీరు, కొన్ని రకాల కెమికల్స్ సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బేగం బజార్‌కు చెందిన ఓ వ్యాపారి దీన్ని నిర్వహిస్తున్నట్టు సమాచారం.
News January 7, 2025
HYD: hMPV పాత వైరస్.. జాగ్రత్త మంచిది: మంత్రి రాజనర్సింహ
hMPV అనేది కొత్త వైరస్ కాదని, 2001లోనే ఈ వైరస్ ఉనికిని కనుగొన్నారని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. నాటి నుంచే ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ వ్యాప్తిలో ఉందని, ఈ వైరస్ శ్వాసకోశ వ్యవస్థపై స్వల్ప ప్రభావం చూపిస్తుందన్నారు. వ్యాధి సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు అతని నోటి నుంచి వచ్చే తుంపర్ల ద్వారా మరొకరికి వైరస్ వ్యాపిస్తుందన్నారు. చైనాలో ఈ సంవత్సరం hMPV కేసులు ఎక్కువయ్యాయన్నారు.