News August 27, 2025
ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖ సూచనలు పాటించాలి: SP

జిల్లాలోని వినాయక మండపాల ఏర్పాట్లలో ఉత్సవ కమిటీ సభ్యులు పోలీస్ శాఖ సూచనలు తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. ప్రశాంతమైన వాతావరణంలో పండుగ నిర్వహించాలని సూచించారు. ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు తలెత్తితే వెంటనే సంబంధిత పోలీస్ అధికారులకు లేదా డయల్ 100, 112 నంబర్లకు కాల్ చేసి సమాచారం అందించాలని కోరారు. మండపాల ఏర్పాట్లలో కమిటీ సభ్యులు నిబంధనలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News August 27, 2025
ఎలక్ట్రిక్ లోకోషెడ్‌లో ‘కవచ్’ లోకోను ప్రారంభించిన DRM

విశాఖ ఎలక్ట్రిక్ లోకోషెడ్‌లో మంగళవారం ‘కవచ్’ లోకోను DRM లలిత్ బొహ్రా జెండా ఊపి ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. రైలు ప్రమాదాలను నివారించడానికి స్వదేశీ పరిజ్ఞానంతో
‘కవచ్’ వ్యవస్థ రూపొందించినట్లు పేర్కొన్నారు. రెండు రైళ్లు ఒకే ట్రాక్ మీద ఎదురెదురుగా దూసుకొస్తున్నప్పుడు పరస్పరం ఢీ కొనకుండా వాటంతట అవే నిలిచిపోయేలా ఈ వ్యవస్థ పనిచేస్తుందన్నారు.
News August 27, 2025
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ UPDATE

పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి కడెం, SRSP, ఎగువ నుంచి పెద్దఎత్తున వరదనీటి ప్రవాహం పెరిగిపోతుంది. బుధవారం ఉదయం ప్రాజెక్టు 9 గేట్లు ఎత్తి దిగువనకు 25, 074 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 148 మీటర్లకు గాను 147.78 మీటర్లకు నీరు చేరింది. 20.175 TMCలకు గాను 19.5641 TMCలకు చేరుకుంది. ఇన్‌ఫ్లో 20,814 c/sలు, అవుట్‌ఫ్లో 28,537 c/sల వరకు చేరుకుంది.
News August 27, 2025
NGKL: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు

గ్రామపంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. తుది ఓటర్ల జాబితా విడుదల చేసిన అధికారులు ఈ జాబితాను గ్రామపంచాయతీలలో ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 30న అభ్యంతరాల స్వీకరణ, 31న తుది జాబితా విడుదల చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఉమ్మడి MBNR జిల్లాలో మొత్తం 1670 గ్రామపంచాయతీలు ఉండగా NGKL జిల్లాలో 464 గ్రామపంచాయతీలు ఉన్నాయి.