News July 8, 2025

ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలి: కలెక్టర్

image

గరుగుబిల్లి మండలం ఉల్లిభద్రలో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కలెక్టర్ శ్యాం ప్రసాద్ మంగళవారం ప్రారంభించారు. ప్రతి ఒక్కరు విరివిగా మొక్కలు నాటి జాగ్రత్తగా సంరక్షించాలని కోరారు. పచ్చని మొక్కలను దత్తత తీసుకొని పెంచే బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల అధికారులు, స్థానిక మహిళలు పాల్గొన్నారు.

Similar News

News July 8, 2025

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

image

భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ముగిశాయి. చివర్లో కొనుగోళ్ల మద్దతుతో లాభాలు ఆర్జించాయి. Sensex 270 పాయింట్ల లాభంతో 83,712 వద్ద ముగిసింది. నిఫ్టీ 61 పాయింట్లు లాభపడి 25,522 వద్ద స్థిరపడింది. కోటక్ మహీంద్రా, ఎటర్నల్, ఏషియన్ పెయింట్స్, NTPC, అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్, SBI, విప్రో షేర్లు లాభపడగా.. టైటాన్, డా.రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా, బజాజ్ ఆటో, మారుతీ సుజుకి షేర్లు నష్టపోయాయి.

News July 8, 2025

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు డిపాజిట్ దక్కదు: Dy.CM

image

త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్‌కి డిపాజిట్ కూడా దక్కదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జోస్యం చెప్పారు. మహబూబాబాద్‌లో ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమంలో మాట్లాడారు. ఈనెల 12 నుంచి రాష్ట్రవ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేస్తామన్నారు. వడ్డీ లేని రుణాలతో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దుతామన్నారు.

News July 8, 2025

జేపీ నడ్డాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

image

TG CM రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రెండోరోజు కొనసాగుతోంది. తాజాగా ఆయన కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో యూరియా, ఎరువుల కొరతపై చర్చించారు. ఇప్పటివరకు 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే సరఫరా అయిందని, మరో 3 లక్షల టన్నులు రావాల్సి ఉందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. త్వరగా యూరియాతో పాటు ఎరువులు సరఫరా చేయాలని కోరారు. కొద్దిసేపట్లో పీయూష్ గోయల్‌తోనూ సీఎం రేవంత్ సమావేశం కానున్నారు.