News November 19, 2024
ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి: కలెక్టర్

ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా జిల్లా గ్రామీణ నీటిసరఫరా, పారిశుద్ధ్య శాఖ ఆధ్వర్యంలో కర్నూలులో అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కలెక్టర్ రంజిత్ బాషా లబ్ధిదారులకు టాయిలెట్స్ ఉత్తర్వులను మంజూరు చేశారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని పిలుపునిచ్చారు.
Similar News
News November 8, 2025
కర్నూలు-వైజాగ్‌కు ఏసీ బస్సు సర్వీసులు ప్రారంభం

కర్నూలు నుంచి వైజాగ్‌కు 3 నూతన ఏసీ బస్సు సర్వీసులను కర్నూలులో మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. ఈ బస్సు సర్వీసుల వల్ల రెండు ప్రాంతాల్లో టూరిజం డెవలప్ అయ్యేందుకు ఆస్కారం ఉంటుందని మంత్రి అన్నారు. ఇక బస్సు ప్రమాదాలు జరగడం ఎంతో బాధాకరమని, ఆటోమేటిక్ స్ప్రింక్లర్ సిస్టమ్ బస్సులో ఉంటే ఇటీవల కర్నూలులో బస్సు ప్రమాదం జరిగేది కాదని అన్నారు. దీనిపై ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసినట్లు ఆయన చెప్పారు.
News November 8, 2025
ఆదోని: ఈతకెళ్లి బాలుడి మృతి

ఆదోని పరిధిలోని బసాపురంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. గౌరమ్మ పండుగ సందర్భంగా పుట్టింటికి వచ్చిన బిచ్చల ఈరన్న కూతురు వరమ్మ కుమారుడు కాలువలో శవంగా తేలాడు. శుక్రవారం పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులు సంబరాల్లో మునిగారు. ఐతే బాలుడు ఒంటరిగా ఈత ఆడుకుంటూ కాలువలో కొట్టుకుపోయాడు. శనివారం హనువాళ్లు గ్రామంలో మృతదేహం లభ్యమైంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News November 8, 2025
పెద్దకడబూరులో హోరాహోరీగా పొట్టేళ్ల పందేలు

పెద్దకడబూరులో శ్రీ భక్త కనకదాసు జయంతిని పురస్కరించుకుని కురువ సంఘం ఆధ్వర్యంలో శనివారం పొట్టేళ్ల పందాలను టీడీపీ నేతలు రమాకాంతరెడ్డి, మల్లికార్జున ప్రారంభించారు. గ్రామీణ క్రీడలలో భాగమే పొట్టేళ్ల పందేలని గుర్తు చేశారు. ఇందులో గెలుపొందిన పొట్టేళ్లకు నగదు బహుమతులు అందజేస్తామన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నల్ల, నట్టు పొట్టేళ్లకు వేరు వేరుగా పోటీలు నిర్వహించారు.


