News February 21, 2025

ప్రతి కార్మికుడు ఈ-శ్రమ్‌ పోర్టల్లో నమోదు చేసేలా చర్యలు తీసుకోండి: కలెక్టర్

image

ఈ-శ్రమ్‌ కార్డు ద్వారా అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత లభిస్తుందని, జిల్లాలో ఉన్న అసంఘటిత రంగ కార్మికులను ఈ-శ్రమ్‌ పోర్టల్లో నమోదు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. గురువారం ఈ-శ్రమ్‌ రిజిస్ట్రేషన్ అంశంపై కార్మిక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, పరిశ్రమల శాఖ, మత్స్య శాఖతో పాటు ఇతర శాఖలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

Similar News

News February 21, 2025

కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు 

image

➤ కర్నూలులో తొలి జీబీఎస్ కేసు నమోదు. ➤ ఎమ్మిగనూరులో మహిళా దొంగల హల్ చల్. ➤ ఈ నెల 23న గ్రూప్-2 పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ. ➤ తుగ్గలి వద్ద బస్సు బోల్తా. ➤ పెద్దకడబూరు: నకిలీ ఇల్లు పట్టాలు.. వ్యక్తిపై కేసు. ➤ జగన్‌కు Z+ భద్రత కల్పించాలని ఎస్వీ మోహన్ రెడ్డి డిమాండ్. ➤ గ్రూప్-2 అభ్యర్థుల కోసం 08518-277305 హెల్ప్ డెస్క్ నంబర్. ➤ ఏపీ ఓబీసీ జిల్లా అధ్యక్షుడిగా చల్లా వరుణ్. 

News February 21, 2025

గ్రూప్-2 అభ్యర్థుల అభ్యర్థుల కోసం హెల్ప్ డెస్క్‌

image

గ్రూప్-2 అభ్యర్థుల సౌలభ్యం కోసం కర్నూలు కలెక్టరేట్‌లో హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. శుక్రవారం కర్నూల్ కలెక్టరేట్‌లో ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమన్వయ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఏవైనా సందేహాలు ఉంటే అభ్యర్థులు టోల్ ఫ్రీ 08518-277305 నంబరుకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చని సూచించారు.

News February 21, 2025

కర్నూలులో జీబీఎస్ కేసు.. వ్యాధి లక్షణాలు ఇవే!

image

☞ కాళ్లు, చేతులలో మంట, <<15529133>>తిమ్మిర్లుగా<<>> అనిపించడం
☞ నరాల బలహీనత, కండరాల నొప్పులు
☞ సరిగ్గా నడవలేకపోవడం, తూలడం వంటి లక్షణాలు
☞ నోరు వంకర పోయి మింగలేక ఇబ్బంది పడే పరిస్థతి
☞ చెమటలు ఎక్కువగా పట్టడం
☞ వ్యాధి తీవ్రత ఎక్కువైతే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు

error: Content is protected !!