News October 20, 2025
ప్రతి గడపలో దీపావళి వెలుగులు నింపాలి: కేసీఆర్

దీపావళి పండుగ సందర్భంగా తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అజ్ఞానపు చీకట్లను తొలగించి జ్ఞానపు వెలుగులు నింపే స్ఫూర్తి ఈ పండుగ ఇస్తుందని పేర్కొన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో రాష్ట్రంలో ప్రగతి వెలుగులు విరజిమ్మాయని, ప్రజల జీవితాల్లో ఆనందం, సంతోషం నిండాలని ఆకాంక్షించారు. ప్రతి ఇంట గడపలో దీపాల కాంతులు వెలుగునింపాలని ప్రార్థించారు.
Similar News
News October 20, 2025
మెరిసే చర్మం కోసం ఈ ఫేస్ ప్యాక్‌లు

అందంగా కనిపించాలని ఎవరికి ఉండదు చెప్పండి. దీనికోసం ఇంట్లోనే ఉండే కొన్నిపదార్థాలతో ఈ ప్యాక్స్ ట్రై చేసి చూడండి. * పెరుగు, తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాలు ఉంచి మెల్లగా మసాజ్ చేస్తూ కడిగేయాలి. దీంతో ముఖానికి మంచి గ్లో వస్తుంది. * పసుపు, గంధం, పాలు, రోజ్ వాటర్ కలిపి మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఈ ప్యాక్ వారానికి రెండుసార్లు వేస్తే ముఖం అందంగా మెరిసిపోతుంది.
News October 20, 2025
కరుడుగట్టిన నేరస్థుడు రియాజ్.. కథ ముగిసింది

TG: నిజామాబాద్ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన రియాజ్ బుల్లెట్ బైకులను చోరీ చేయడంలో దిట్ట అని పోలీసులు వెల్లడించారు. ఇతడిపై 60కి పైగా కేసులున్నాయి. శుక్రవారం కానిస్టేబుల్ ప్రమోద్ ఇతడిని పట్టుకుని బైకుపై తీసుకెళ్తుండగా కత్తితో పొడిచి చంపి పారిపోయాడు. నిన్న పోలీసులు అతడిని పట్టుకున్నారు. ఆ క్రమంలో గాయాలు కావడంతో ఆస్పత్రిలో చేర్చారు. ఇవాళ గన్ తీసుకుని పారిపోతుండగా పోలీసులు జరిపిన కాల్పుల్లో చనిపోయాడు.
News October 20, 2025
HYD: సెంచరీకి మరో ఆరు.. రేపు పూర్తయ్యే అవకాశం

మీరు చదివింది నిజం.. సెంచరీకి మరో ఆరుమంది దూరంగా ఉన్నారు. అయితే అది క్రికెట్‌లో కాదండి.. ఎన్నికల్లో. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోటీచేసేందుకు ఆసక్తి ఉన్న వారు నామినేషన్లు వేశారు. ఇప్పటి వరకు 94 మంది నామినేషన్లు సమర్పించారు. ఇక కేవలం 6 వేస్తే వీరి సంఖ్య 100కు చేరుకుంటుందన్నమాట. నామినేషన్ల దాఖలుకు రేపు చివరి రోజు కావడంతో ఈ సంఖ్య ఎంతకు చేరుతుందో అని ప్రజలతోపాటు అధికారులు ఎదురుచూస్తున్నారు.