News August 30, 2025
ప్రతి గణపతి మండపానికి జియో ట్యాగింగ్: ఎస్పీ

ప్రజలు ప్రశాంతంగా వినాయక ఉత్సవాలు జరుపుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని శుక్రవారం ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతి గణపతి మండపాన్ని జియో ట్యాగింగ్ చేసి బందోబస్తు పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ యువతకు చేరువై వారి సహకారంతో ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు.
Similar News
News September 1, 2025
ADB: వినాయక నిమజ్జనం ఏర్పాట్లపై సమీక్ష

వినాయక నిమజ్జనం ఏర్పాట్లపై సోమవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్ సమీక్ష నిర్వహించారు. సంబంధిత శాఖలన్నీ సమగ్ర సమన్వయంతో ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులు ఆదేశించారు. ఉత్సవాల నిర్వహణకు జిల్లా యంత్రాంగం తరఫున పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామన్నారు. రోడ్ల మరమ్మతులు, శోభాయాత్రకు అడ్డంకిగా ఉండే చెట్ల కొమ్మలను తొలగించనున్నట్లు చెప్పారు.
News September 1, 2025
ADB: రాష్ట్రస్థాయి పోటీల్లో అశ్వినికి గోల్డ్

మహబూబ్‌నగర్‌లో జరుగుతున్న 11వ రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో ఆదివారం జిల్లా క్రీడాకారిణి సత్తా చాటింది. అండర్ 20 విభాగంలో అశ్విని హైజంప్ ఈవెంట్లో స్వర్ణం గెలుచుకుందని శిక్షకుడు రాకేశ్ తెలిపారు. రాష్ట్రస్థాయిలో సత్తా చాటడం పట్ల డీవైఎస్ఓ జక్కుల శ్రీనివాస్, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అడ్డి భోజారెడ్డి, రాజేశ్ తదితరులు ఆమెను అభినందించారు.
News August 31, 2025
అంకిత భావంతో సేవలందించడం అభినందనీయం : ఎస్పీ

ఏఎస్ఐ ఎస్.దిలీప్ (తాంసి, పీఎస్), ఏఎస్ఐ ముంతాజ్ అహ్మద్ (భీంపూర్ పీఎస్) పదవీ విరమణ పొందిన సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదివారం వారిని సన్మానించారు. 35 ఏళ్లకు పైగా పోలీసు సర్వీసులో చిన్న రిమార్క్ కూడా లేకుండా ఇద్దరూ అంకితభావంతో సేవలందించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, ఏఎస్ఐల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.