News December 12, 2025
ప్రతి గర్భిణీని మొదటి 3 నెలల్లో తప్పక నమోదు చేయాలి: DMHO

గర్భిణీ స్త్రీలు మొదటి 3 నెలలలోపే తప్పక నమోదు చేయించుకోవాలని DMHO విజయమ్మ తెలిపారు. శుక్రవారం ఆయన కార్యాలయంలో జరిగిన శిశు మరణాలపై సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. నమోదు చేసినప్పటి నుండి వారికి అవసరమైన అన్ని వైద్యపరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. హైరిస్క్ గర్భిణీలపై ప్రత్యేక శ్రద్ధ వహించి, ఏడో నెలలో బర్త్ ప్లాన్ ఇవ్వాలన్నారు. నవజాత శిశువు సంరక్షణపై ముందుగానే అవగాహన కల్పించాలని ఆమె సూచించారు.
Similar News
News December 14, 2025
‘నల్లమల సాగర్’పై సుప్రీంలో ఏపీ కేవియట్!

AP: పోలవరం-నల్లమల సాగర్ సాగునీటి ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణ సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందుగానే కేవియట్ పిటిషన్ వేయాలని నిర్ణయించింది. ఈ బాధ్యతను కృష్ణా డెల్టా చీఫ్ ఇంజినీర్‌కు అప్పగించింది. కాగా ఈ ప్రాజెక్టు డీపీఆర్ తయారీకి రెండు సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. L1గా వచ్చిన సంస్థకు బాధ్యతలు అప్పగిస్తారు.
News December 14, 2025
రంగారెడ్డి: మొదలైన పోలింగ్.. ఓటేయండి

రంగారెడ్డి జిల్లాలో సర్పంచ్ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. షాబాద్ మం.లోని ఎల్గొండగూడలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 178 జీపీలకు ఎన్నికల జరగనుండగా.. ఇప్పటికే కొన్ని ఏకగ్రీవం అయ్యాయి. మిగతా అన్ని పంచాయతీల్లో పోలింగ్ జరుగుతోంది. వెళ్లి ఓటేయండి.
News December 14, 2025
వరంగల్ జిల్లాలో ప్రారంభమైన రెండో విడత పోలింగ్

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 508 గ్రామ పంచాయతీల్లో రెండో విడత పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 వరకు పోలింగ్ జరుగనుంది. 2 గంటల నుంచి వార్డు సభ్యుల ఓట్లను 25 చొప్పున బండిళ్లు కట్టిన అనంతరం లెక్కిస్తారు. సర్పంచ్ ఫలితాలు సాయంత్రం 4 గంటల నుంచి వెలువడనున్నాయి. 6 జిల్లాల్లోని 508 జీపీలకు 1686 మంది సర్పంచ్ అభ్యర్థులు, 4020 వార్డుల్లో 9884 మంది పోటీ పడుతున్నారు.


