News January 18, 2025

ప్రతి గామానికి ఒక రెవెన్యూ అధికారి: మంత్రి పొంగులేటి

image

పంచాయతీ రెవెన్యూ వ్యవస్థకు సంబంధించి ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక అధికారిని నియమించేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతుందని సంబంధిత శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. HYD సచివాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం 450 మంది సర్వేయర్లు మాత్రమే ఉన్నారని, మరో వెయ్యి మందిని నియమించేలా అధికారులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Similar News

News February 5, 2025

వెనుకబడిన ఎన్ని జిల్లాలను కేంద్రం గుర్తించింది: ఖమ్మం ఎంపీ

image

విద్యాపరంగా వెనుకబడిన జిల్లాల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు, విద్యాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతోందని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి లోక్‌సభలో ప్రశ్నించారు. గత ఐదేళ్లలో విద్యాపరంగా వెనుకబడిన ఎన్ని జిల్లాలను గుర్తించారని, తాజా జనాభా లెక్కల ప్రకారం ఆయా జిల్లాల్లో SC,ST నిష్పత్తి ఏ విధంగా ఉందని అడిగారు. దీనికి కేంద్ర సహాయ మంత్రి జయంత్ ఎంపీకి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

News February 5, 2025

ఖమ్మం పోలీసులకు 42 పతకాలు.. సీపీ అభినందన

image

ఇటీవల కరీంనగర్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌లో వివిధ విభాగాల్లో జిల్లా ఉద్యోగులు 42 పతకాలు సాధించారు. ఈ సందర్భంగా ఖమ్మం సీపీ సునీల్ దత్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీసు క్రీడాకారులను అభినందించి మాట్లాడారు. సవాళ్లు, ఒత్తిడితో కూడిన ఉద్యోగం చేస్తూనే క్రీడల్లో పతకాలు సాధించడం అభినందనీయమని, ఇదే స్ఫూర్తితో జాతీయ స్థాయి స్పోర్ట్స్ మీట్‌లోనూ పతకాలు సాధించాలని కాంక్షించారు.

News February 5, 2025

డయల్ 100కు 4,056 కాల్స్: ఖమ్మం సీపీ

image

ఖమ్మం: సమాజంలో పెరిగిపోయిన నేర ప్రవృత్తి నేపథ్యంలో ప్రజల ధన, మాన ప్రాణాల రక్షణే ధ్యేయంగా ఏర్పాలైన డయల్ 100కు జనవరి నెలలో 4,056 కాల్స్ వచ్చాయని సీపీ సునీల్ దత్ ఒక ప్రకటనలో తెలిపారు. వీటిపై 57 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశామని, వీటిలో హత్యాయత్నం-1, మహిళలపై వేధింపులు-1, దొంగతనాలు-9, సాధారణ ఘాతాలు-14, యాక్సిడెంట్లు-11, అనుమానాస్పద మరణాలు-4, ఇతర కేసులు-17 ఉన్నాయన్నారు.

error: Content is protected !!