News February 19, 2026

ప్రతి జిల్లాకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్: హోంమంత్రి అనిత

image

సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రతి జిల్లాకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. గురువారం శాసనసభలో మాట్లాడారు. సైబర్ వర్టికల్ వింగ్ ఏర్పాటుకు కూడా ప్రతిపాదనలు పంపించామన్నారు. రూ.2కోట్లతో అధునాతనమైన సైబర్ ఫోరెన్సిక్ పరికరాలను సమకూరుస్తున్నామని చెప్పారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.

Similar News

News February 20, 2026

సుప్రీంకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

<>సుప్రీంకోర్టు<<>> 22 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు FEB 23 నుంచి మార్చి 8 వరకు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ ఎడిటర్, అసిస్టెంట్ డైరెక్టర్, Sr. కోర్ట్ అసిస్టెంట్, అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి. ఉద్యోగాన్ని బట్టి LLB, PG(మ్యూజియాలజీ), BLSc అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, కంప్యూటర్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.sci.gov.in

News February 20, 2026

గొర్రెల్లో నీలి నాలుక వ్యాధి కట్టడికి సూచనలు

image

గొర్రెల‌కు నీలి నాలుక వ్యాధి సోక‌కుండా ఉండాలంటే వైర‌స్ వ్యాప్తికి కార‌ణ‌మ‌య్యే దోమ‌ల‌ను కట్టడి చేయాలి. దీని కోసం ప్రతి రోజూ ఎండిన వేపాకులతో పొగ పెట్టాలి. వ్యాధి సోకిన గొర్రెలను మంద నుంచి వేరుచేస్తే మిగ‌తా వాటికి వ్యాధి వ్యాపించ‌దు. గొర్రెల షెడ్‌ను పొడిగా ఉంచాలి. వ్యాధి సోకిన గొర్రెలను వెటర్నరీ డాక్టరుకు చూపించి అవసరమైన మందులు వాడాలి. వ్యాధి కట్టడికి ప్రభుత్వం అందించే టీకాలను గొర్రెలకు వేయించాలి.

News February 20, 2026

అనకాపల్లి: ఉద్యోగుల గ్రీవెన్స్‌కు 16 అర్జీలు

image

అనకాపల్లి కలెక్టరేట్‌లో ఉద్యోగుల సమస్యలపై శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్ ఉద్యోగం నుంచి అర్జీలను స్వీకరించి వాటిని పరిశీలించారు. ఉద్యోగుల వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెల 3వ శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరిష్కారానికి అవకాశం గల ప్రతి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.