News April 5, 2025

ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి: సీఎం

image

రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి సీఎం చంద్రబాబు కార్యాచరణ ఆదేశాలు జారీ చేశారు. వెలగపూడిలో అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే 70 నియోజకవర్గాల్లో 100 పడకలపైగా ఆస్పత్రులు ఉన్నాయని, మిగిలిన 105 ప్రాంతాల్లో త్వరితంగా ఆస్పత్రుల నిర్మాణం చేపట్టాలని సూచించారు. PPP పద్ధతిలో ఆస్పత్రులు నిర్మించి పరిశ్రమల తరహాలో సబ్సిడీలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. 

Similar News

News April 4, 2025

బర్డ్ ఫ్లూ కాదు… బాలిక మృతికి ఇతర కారణాలే

image

నరసరావుపేటలో బాలిక మృతిపై బర్డ్ ఫ్లూ అనుమానాలు తొలగిపోయాయి. ICMR బృందం తెలిపిన వివరాల ప్రకారం.. వ్యాధినిరోధక శక్తి లోపం, అపరిశుభ్రత, లెప్టోస్పిరోసిస్‌ వంటి కారణాలే ప్రాణాపాయానికి దారితీశాయని తేలింది. బాలిక నుంచి H5N1 లక్షణాలు కనుగొన్నా, పరిసరాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి లేదని అధికారులు పేర్కొన్నారు. ఈ అంశంపై CM చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని వైద్యాధికారులు అన్నారు.

News April 4, 2025

రీ-వెరిఫికేషన్ సద్వినియోగం చేసుకోండి: భార్గవ్ తేజ

image

కలెక్టరేట్‌లో శుక్రువారం జిల్లా స్థాయి దివ్యాంగుల కమిటీ సమావేశం జరిగింది. జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ సమావేశంలో పాల్గొని వికలాంగుల సంక్షేమం, ట్రాన్స్ జండర్స్, సీనియర్ సిటిజన్స్ సంక్షేమం, తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. సదరన్ సర్టిఫికెట్లు జీజీహెచ్‌లో రీ-వెరిఫికేషన్ జరుగుతుందని, స్లాట్ బుకింగ్ చేసుకోవాలని చెప్పారు. వికలాంగుల హక్కుల చట్టం 2016, వికలాంగుల సర్టిఫికెట్ల పంపిణీపై సమీక్షించారు. 

News April 4, 2025

మాచర్ల నియోజకవర్గంలో ఒకరి హత్య

image

ఉమ్మడి గుంటూరు జిల్లా మాచర్ల పరిధిలో హరిచంద్ర హత్యకు గురయ్యాడు. శుక్రవారం ఆయన మృతదేహం పొలంలో ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. కాగా రెండు రోజుల క్రితం నాగార్జున సాగర్ హిల్ కాలనీలో హరిచంద్ర కిడ్నాప్‌కు గురయ్యారు. రెండు రోజుల తర్వాత ఆయన శవమై కనిపించారు. పోలీసులు తమకు అందిన ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించారు. హత్యకు కుటుంబ కలహాలు కారణమా? రాజకీయా కోణమా? అనేది దర్యాప్తు చేస్తున్నారు

error: Content is protected !!